ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Masood Azhar: నేను పోయినా బాగుండేది

ABN, Publish Date - May 08 , 2025 | 03:35 AM

భారత వైమానిక దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కుటుంబ సభ్యులు సహా 14 మంది మరణించారని అజర్‌ వెల్లడించాడు. దీనిపై పశ్చాతాపం లేదని చెప్పిన అతను, తాను కూడా చనిపోయి ఉండి ఉంటే బాగుండేదని నిర్వేదంగా పేర్కొన్నాడు.

మసూద్‌ ఇంట్లోనే 14 మంది హతం

మసూద్‌ పెద్దక్క సాహిబా, ఆమె భర్త, మేనల్లుడు అలీమ్‌ ఫాజిల్‌, అతని భార్య. సోదరుడు హుజైఫా, అతని తల్లి, మేనకోడలు అలామ్‌ ఫాజిలా.

ఐదుగురు పిల్లలు, ఇద్దరు సహచరులు.

జైషే మహ్మద్‌ చీఫ్‌ కుటుంబంలో 10మంది హతం

మరో నలుగురు సహాయకులు కూడా ఖతం

పశ్చాతాపం, భయం, బాధ లేవు కానీ..

నేనూ చనిపోయి ఉంటే బాగుండేది: అజర్‌

న్యూఢిల్లీ, మే 7: భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు చావు దెబ్బ తగిలింది. బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ ప్రధాన కేంద్రంపై జరిగిన దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మందితోపాటు, తన నలుగురు సహాయకులు కలిపి మొత్తం 14 మంది మరణించినట్టు మసూద్‌ అజర్‌ బుధవారం వెల్లడించాడు. వారు ఆనందంగా దేవుని చెంతకు చేరారన్నాడు. దీనిపట్ల తనకేమీ పశ్చాతాపంగానీ, నిరాశగానీ లేవంటూనే.. ‘ఈ దాడిలో నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది..’ అని నిర్వేదం వ్యక్తం చేశాడు. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని అజర్‌ ప్రకటించాడు. ‘‘ఈ రోజు రాత్రి నా కుటుంబంలో పది మంది చనిపోయారు. వారిలో ఐదుగురు అమాయక పిల్లలు. ప్రాణం కంటే ఎక్కువైన నా అక్క సాహిబా, ఆమె భర్త, నా మేనల్లుడు అలీం ఫాజిల్‌, అతని భార్య, మేనకోడలు ఆలం ఫాజిలా, నా సోదరుడు, అతని తల్లి, నా ఇద్దరు సహచరులు.. ఆనందంగా దేవుని చెంతకు చేరారు. వారికి సమయం వచ్చింది. కానీ.. ఆ దేవుడు వారిని చంపలేదు’’ అని అజర్‌ వెల్లడించారు. వారి అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.


పశ్చాతాపం లేదు: అజర్‌

‘అమాయకులైన చిన్నారులు, మహిళలు, వృద్ధులను మోదీ టార్గెట్‌ చేశారు. దుఃఖం, దిగ్ర్భాంతి భరించలేనంత గొప్పవి. కానీ.. ఈ మరణాల పట్ల పశ్చాతాపం లేదు. నిరాశ లేదు.. భయం లేదు. ఈ 14 మందిలో నేను కూడా ఉండివుంటే బాగుండేదని మాత్రం పదే పదే అనిపిస్తోంది. కానీ.. అల్లాను కలిసే సమయం ముందే రాసి పెట్టి ఉంటుంది. మా ఇంట్లో 3 నుంచి 7 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. వారంతా కలిసి స్వర్గానికి వెళ్లారు. భగవంతుడు తాను ప్రేమించే వారికే అమరత్వం ఇస్తాడని ఖురాన్‌ చెబుతోంది. ఇప్పుడు వాళ్లకు సమయం వచ్చింది. జరగబోయేది ఎవరూ ఊహించలేరు’’ అని అజర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

భారత్‌పై దాడులకు కుట్ర

56 ఏళ్ల మసూద్‌ అజర్‌.. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్‌ దాడి, 2019లో పుల్వామా దాడితో సహా భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడన్నది బహిరంగ రహస్యమే. అయితే పాక్‌ మాత్రం అతనికి సంబంధించిన సమాచారం ఏదీ తమ వద్ద లేదని పదేపదే చెబుతూ వస్తోంది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 03:35 AM