ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

S Jaishankar: భారత్ ఎప్పటికీ అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌కు లొంగదు

ABN, Publish Date - May 30 , 2025 | 09:42 PM

ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ, ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఉగ్రవాద సేవలను వినియోగించుకుంటున్నారో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పాక్ ఉగ్రవాదాన్ని జైశంకర్ ఎండగట్టారు.

వడోదర: భారతదేశం ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అన్నారు. గుజరాత్‌లో వడోదరలో శుక్రవారంనాడు జరిగిన పరుల్ యునివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ, ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఉగ్రవాద సేవలను వినియోగించుకుంటున్నారో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పాక్ ఉగ్రవాదాన్ని ఎండగట్టారు.


పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సాయుధ బలగాలు ఇటీవల పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమెుందించిన నేపథ్యంలో జైశంకర్ తాజా వ్యాఖ్యలు చేశారు.


భారతదేశం అరుదైన నాగరికత కలిగిన దేశమని జైశంకర్ పేర్కొంటూ ఆ కారణంగానే ఈరోజు ప్రపంచ దేశాల సమాఖ్యలో భారతదేశం సమున్నత స్థానంలో ఉందని అన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు కొందరికి ఫ్యాషన్ కావచ్చేమో కానీ, భారతదేశం మాత్రం పరస్పర విశ్వాసం ప్రాతిపదిక గానే మైత్రీ సంబంధాలను నెరుపుతుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..

మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 09:44 PM