News Delhi: మార్కో రుబియో ఫోన్ కాల్‌పై ఎస్ జయశంకర్ ఎమన్నారంటే..
ABN, Publish Date - May 01 , 2025 | 11:23 AM
ఉగ్రవాదం పోరులో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇరుదేశాల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సహకారం అందిస్తామన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి (US Secretary of State) మార్కో రుబియో (Marco Rubio) ఫోన్ కాల్ (Phone Call)పై భారత విదేశాంగశాఖ మంత్రి (Indian Foreign Minister) జయశంకర్ (Jaishankar) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా స్సందించారు (Respond). పహెల్గాం దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని ఇందుకు బాధ్యలైన వారందరికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ దాడి జరిపినవారు, వారికి మద్దతు ఇచ్చినవారితోపాటు కుట్ర దాడులను ప్రపంచం ముందుకు తీసుకువస్తామన్నారు.
Also Read: కార్మిక లోకానికి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
భారత్‌కు అండగా అమెరికా..
ఉగ్రవాదం పోరులో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇరుదేశాల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సహకారం అందిస్తామన్నారు. ఇక పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు మార్కో రుబియో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలను కోరారు.
ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి.. మార్క్ రుబియో
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం కొనసాగిద్దామని జయశంకర్‌కు మార్కో రుబియో భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకుని దక్షిణాసియాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇక పాక్ ప్రధానితో మాట్లాడిన రుబియో పహెల్గాం ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అనాలోచిత దాడిపై దార్యాప్తుకు పాక్ అధికారులు సహకరించాలని ఆయన అన్నారు. ఉద్రిక్తలను తగ్గించుకునేందుకు భారీత్‌తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్‌కు సూచించారు. ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రుబియో స్పష్టం చేశారు.
కాగా జమ్మూ కాశ్మీర్ పహెల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌పై పలు కఠిన చర్యలకు దిగింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అట్టారీ వాఘా సరిహద్దును కూడా మూసేసింది. భారత్‌లో ఉంటున్న పాకిస్థానీలందరినీ వెళ్లిపోవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ డెడ్‌లైన విధించింది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. ఇక పాక్ కూడా తమ గగనతలంలో భారత విమానాలకు అనుమతిని నిరాకరించడంతో పాటు షిమ్లా ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..
CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..
For More AP News and Telugu News
Updated Date - May 01 , 2025 | 11:24 AM