ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Pakistan Tensions: పాకిస్తాన్‎ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..

ABN, Publish Date - May 10 , 2025 | 02:41 PM

భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాక్ చేస్తున్న దాడులను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఉప ప్రధాని బేరసారాల కోసం అమెరికాను వేడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

India Pakistan Tensions

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు క్రమంగా యుద్ధం దిశగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండగా, సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో యుద్ధ వాతావరణం పెరుగుతోంది. ఇదే సయమంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడుతూ, భారతదేశం తన దాడుల చర్యను ఆపితే, పాకిస్తాన్ కూడా అదే చేస్తుందన్నారు. ఈ ప్రకటన, పరిస్ధితిని మరింత ఉద్రిక్తంగా మార్చకుండా సంయమనం పాటించాలనే సంకేతాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.


నష్టం జరిగినా కూడా..

ఈ క్రమంలోనే ఈరోజు (మే 10న) ఉదయం భారత్ పాకిస్తాన్‌లోని మూడు కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ స్థావరాలు షోర్కోట్‌లోని రఫీకీ ఎయిర్‌బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్, రావల్పిండిలోని నూర్ ఖాన్ (చక్లాలా) ఎయిర్‌బేస్‌లు ఉన్నాయి. భారత్ గగనతల-ఉపరితల క్షిపణులతో ఈ దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. అయినప్పటికీ పాకిస్తాన్ మత్రం తమ వైమానిక దళ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎంత నష్టం జరిగినా కూడా పాకిస్తాన్ మాత్రం అదే పాట పాడుతోంది. మరోవైపు పాకిస్తాన్ తీరును చూసి టర్కీ సహా ఏ దేశాలు కూడా సపోర్ట్ చేయడం లేదు. చైనా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నా కూడా ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది.


వేడుకున్న పాకిస్తాన్

ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశాన్ని కాపాడాలని పాకిస్తాన్.. అగ్రరాజ్యమైన అమెరికాను వేడుకుంది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇండియాతో శాంతి ఒప్పందం కుదుర్చాలని వేడుకున్నారు. ట్రంప్ కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. కానీ బేరసారాల కోసం వెళ్లిన పాకిస్తాన్‎కు ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో మాత్రం పాకిస్తాన్ వెనక్కి తగ్గాలని మార్కో రూబియో సూచించారు. ముందుగా దాడులు చేసింది పాకిస్తాన్ కాబట్టి, భారత్ విషయంలో తప్పులేదన్నారు. ఈ క్రమంలో భారతదేశం తన దాడుల చర్యను ఆపేస్తే, మేము కూడా ఆపేస్తామని పాక్ ఉపప్రధాని అన్నారు. అందుకోసం చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 03:47 PM