Kannada News: భార్య శ్రీమంతం రోజు ఊహించని విషాదం..
ABN, Publish Date - May 23 , 2025 | 10:01 PM
Kannada News: సతీష్‌కు ఏడాది క్రితం పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య ఏడు నెలల గర్భంతో ఉంది. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నో కలలు కంటూ ఉన్నారు. సతీష్ భార్యకు తాజాగా, శ్రీమంతం నిర్వహించారు.
మరణం ఎప్పుడు.. ఎవర్ని.. ఎలా చేరుకుంటుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటి వరకు ఎంతో సంతోషంతో నవ్వుతూ తుళ్లుతూ మన మధ్య తిరిగి వాళ్లు కూడా.. హఠాత్తుగా మరణిస్తూ ఉంటారు. సొంత వాళ్లను కన్నీళ్లలో ముంచి వెళ్లిపోతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి భార్య శ్రీమంతం రోజే ఊహించని విధంగా కన్నుమూశాడు. గుండె పోటు కారణంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. భూమ్మీదకు ఇంకా చేరుకోని బిడ్డను తండ్రి లేని వాడ్ని చేశాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర కన్నడ జిల్లా బంత్వాల్ తాలూకా మిట్టనడక గ్రామానికి చెందిన సతీష్‌కు ఏడాది క్రితం పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య ఏడు నెలల గర్భంతో ఉంది. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నో కలలు కంటూ ఉన్నారు. సతీష్ భార్యకు తాజాగా, శ్రీమంతం నిర్వహించారు. శ్రీమంతం వేడుకకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. బంధు, మిత్రులు పెద్ద ఎత్తున వచ్చారు.
సతీష్ నవ్వుతూ, తుళ్లుతూ కార్యక్రమానికి వచ్చిన జనాల్ని పలకరిస్తూ ఉన్నాడు. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, అతడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఎంత లేపినా సతీష్ లేవలేదు. కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. సతీష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా చనిపోయినట్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సతీష్ భార్య సంగతి అయితే, చెప్పక్కర్లేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
ఇవి కూడా చదవండి
Viral Video: నువ్వసలు తల్లివేనా.. పిల్లలతో అంత దారుణంగా ప్రవర్తిస్తావా..
Chandrababu Naidu: ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.. సీఎం చంద్రబాబు
Updated Date - May 23 , 2025 | 10:05 PM