Share News

Viral Video: నువ్వసలు తల్లివేనా.. పిల్లలతో అంత దారుణంగా ప్రవర్తిస్తావా..

ABN , Publish Date - May 23 , 2025 | 09:33 PM

Mother And Children: ఆ పిల్లలు ఏం చేశారో ఏమో తెలీదు కానీ.. బిడ్డలపై ఆ తల్లి ఆగ్రహానికి గురైంది. వాళ్లను చావగొట్టేంత కోపం తెచ్చుకుంది. వారిపై చెప్పుతో దాడికి దిగింది.

Viral Video: నువ్వసలు తల్లివేనా.. పిల్లలతో అంత దారుణంగా ప్రవర్తిస్తావా..
Mother And Children

దేవుడి సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదని అంటారు. ఓ తల్లి తను చావడానికైనా సిద్ధపడుతుందేమో కానీ, బిడ్డలకు మాత్రం ఏ చిన్న హానీ జరగనివ్వదు. అయితే, కొంతమంది తల్లులు మాత్రం తమ స్వార్ధం కోసం కన్నబిడ్డల్ని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. తమ సుఖం కంటే పిల్లల భవిష్యత్తు ఏ మాత్రం ఎక్కువ కాదనుకుంటున్నారు. తాజాగా, ఓ తల్లి తన బిడ్డల్ని దారుణంగా హింసించింది. చెప్పుతో చంటి బిడ్డల్ని చావగొట్టింది.


అంతటితో ఆగకుండా వారిని నేలకు విసిరి కొట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బులందేశ్వర్‌కు చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేశారో ఏమో తెలీదు కానీ.. బిడ్డలపై ఆ తల్లి ఆగ్రహానికి గురైంది. వాళ్లను చావగొట్టేంత కోపం తెచ్చుకుంది. వారిపై చెప్పుతో దాడికి దిగింది.


చెప్పుతో వారిని చావగొట్టింది. వారు దెబ్బలు తాళ లేక ఏడుస్తున్నా పట్టించుకోలేదు. ఇష్టం వచ్చినట్లు కొట్టింది. పక్కన ఉన్న వాళ్లు ఎంత చెప్పినా వినలేదు. వారి మాటల్ని లెక్క కూడా చేయలేదు. పిల్లల్ని మంచంపై నుంచి కిందుకు విసిరి కొట్టింది. ఆ తర్వాత కూడా చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వసలు తల్లివేనా ’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

Viral Video: రన్నింగ్‌లో ఉన్న ట్రక్ నుంచి దొంగతనం.. సినిమాకు ఏ మాత్రం తీసి పోని యాక్షన్ సీన్..

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Updated Date - May 23 , 2025 | 09:33 PM