Share News

Viral Video: రన్నింగ్‌లో ఉన్న ట్రక్ నుంచి దొంగతనం.. సినిమాకు ఏ మాత్రం తీసి పోని యాక్షన్ సీన్..

ABN , Publish Date - May 23 , 2025 | 06:50 PM

Madhya Pradesh Viral Video: హృతిక్ మారు వేషంలో వచ్చి అత్యంత విలువైన వజ్రాన్ని కొట్టేస్తాడు. రన్నింగ్ ట్రైన్ మీదే ఫైట్ సీన్ ఉంటుంది. మొత్తానికి హీరో వజ్రంతో ట్రైన్ నుంచి బయటపడతాడు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా.. ధూమ్ సినిమా యాక్షన్ సీన్‌ను తలపించేలా ఓ సంఘటన జరిగింది.

Viral Video: రన్నింగ్‌లో ఉన్న ట్రక్ నుంచి దొంగతనం.. సినిమాకు ఏ మాత్రం తీసి పోని యాక్షన్ సీన్..
Madhya Pradesh viral video

ధూమ్ సినిమా సిరీస్‌లు చూసిన వారికి అందులోని యాక్షన్ సీన్లు గుర్తుండే ఉంటాయి. ఇప్పటి వరకు మూడు సినిమాలు ధూమ్ నుంచి విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అందులోని యాక్షన్ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్ రైల్ దొంగతనంతో మొదలవుతుంది. హృతిక్ మారు వేషంలో వచ్చి అత్యంత విలువైన వజ్రాన్ని కొట్టేస్తాడు. రన్నింగ్ ట్రైన్ మీదే ఫైట్ సీన్ ఉంటుంది. మొత్తానికి హీరో వజ్రంతో ట్రైన్ నుంచి బయటపడతాడు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా.. ధూమ్ సినిమా యాక్షన్ సీన్‌ను తలపించేలా ఓ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో గత ఏడాదినుంచి తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ ట్రక్కు లోడుతో ఆగ్రా, ముంబై హైవేపై దివాస్, షాజాపూర్ రూటు వైపు వెళుతూ ఉంది. ఆ ట్రక్కుపై ఓ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లోడుకు కప్పిన కవర్‌కు కన్నంపెట్టి.. ఓ బాక్సును బయటకు తీశారు. తర్వాత దాన్ని కిందపడేశారు. కింద రోడ్డుపై మూడో వ్యక్తితో బైకులో ఫాలో అవుతూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కిందకు దిగారు. దిగటం అంటే అలా ఇలా కాదు.. రన్నింగ్‌లో ఉన్న ట్రక్కు నుంచి రన్నింగ్‌లో ఉన్న బైకుపైకి దిగారు.


ఈ మొత్తం దొంగతనాన్ని కారులో.. అదే రోడ్డుపై వెళుతున్న వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2024లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అందుకు సంబందించిన వీడియో మరో సారి వైరల్ అయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. దివాస్, తరానా రూటులో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయట. పోలీసు అధికారులే స్వయంగా చెప్పారు.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 23 , 2025 | 07:06 PM