Share News

Chandrababu Naidu: ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.. సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 23 , 2025 | 08:40 PM

Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీలు అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలను ఆయన కేంద్ర మంత్రులకు వివరిస్తున్నారు.

Chandrababu Naidu: ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.. సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముందెన్నడూ లేని విధంగా విధ్వంసం జరిగిందని ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని తెలిపారు. ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీలు అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలను ఆయన కేంద్ర మంత్రులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.


గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ పోలవరంపై సీఆర్‌ పాటిల్‌తో చర్చించాం. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తికి ప్రయత్నాలు చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్‌ను వైసీపీ ప్రభుత్వం నీళ్లలో కలిపేసింది. నాణ్యతలో రాజీపడకుండా పోలవరం నిర్మిస్తాం. బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ అభ్యంతరం ఉండదు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు రూ. 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌ ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. సముద్రంలోకి వెళ్లే నీళ్లనే బనకచర్లకు మళ్లిస్తాం’ అని అన్నారు.


విభజన చట్టంలో అమరావతి

అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 గురించి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తామన్నారు. ఏపీలో సైనిక కంటోన్మెంట్‌ పెట్టాలని కోరామన్నారు. సంపద సృష్టించాలంటే కొత్త విధానాలు తీసుకురావాలన్నారు. ఆర్థిక సాయం మాత్రమే కాదు.. అనుకూలమైన ప్రతిపాదనలు కూడా కావాలని అడిగినట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి

72nd Miss World Festival: మహిళా సాధికారతపై ప్రశ్నలు.. తెలంగాణను ప్రశంసించిన అందగత్తెలు..

Viral Video: రన్నింగ్‌లో ఉన్న ట్రక్ నుంచి దొంగతనం.. సినిమాకు ఏ మాత్రం తీసి పోని యాక్షన్ సీన్..

Updated Date - May 23 , 2025 | 09:00 PM