72nd Miss World Festival: మహిళా సాధికారతపై ప్రశ్నలు.. తెలంగాణను ప్రశంసించిన అందగత్తెలు..
ABN , Publish Date - May 23 , 2025 | 07:30 PM
72nd Miss World Festival: ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, అమెరికా, కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది అందగత్తెలు సామాజిక సమస్యలపై తమదైన శైలిలో స్పందించారు.
హైదరాబాద్ : 72వ మిస్ వరల్డ్ పోటీల్లో కీలక భాగమైన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడెంట్‌లో అట్టహాసంగా జరిగింది. ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, అమెరికా, కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది అందగత్తెలు సామాజిక సమస్యలపై తమదైన శైలిలో స్పందించారు. తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక, ఈ పోటీల్లో గెలిచిన వారిని కాంటినెంట్ టాప్ 10కి ఎంపిక చేశారు.
తెలంగాణపై అందగత్తెల ప్రశంసల వర్షం..
బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ , టొబాగో నుంచి వచ్చిన పోటీదారులకు.. ‘హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తెలంగాణలో మహిళల భద్రత, సాధికారతపై ప్రపంచానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తారు..’ అనే ప్రశ్న అడిగారు. ఇందుకు మిస్ గయానా సమాధానం ఇస్తూ.. ‘మహిళలు ఎక్కడికైనా వెళ్ళగలరు. భద్రత అనేది హక్కు. మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి తెలంగాణ అనువైన ప్రదేశం’ అని ప్రశంసించారు.
కాంటినెంట్ తుది రౌండ్ విజేతగా నిలిచిన మిస్ ట్రినిడాడ్ , టొబాగో మాట్లాడుతూ.. ‘ప్రగతి, సాధికారత ఒకటే. ఈ రెండిటిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. సగం జనాభా వెనుకబడి ఉంటే విజయం సాధించలేము. మరీ ముఖ్యంగా మహిళలను ముందుకు నడిపిస్తున్న తెలంగాణకు ధన్యవాదాలు’ అని ఆమె అన్నారు. అందగత్తెలు మహిళా సాధికారత విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
Viral Video: రన్నింగ్‌లో ఉన్న ట్రక్ నుంచి దొంగతనం.. సినిమాకు ఏ మాత్రం తీసి పోని యాక్షన్ సీన్..
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం