ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

ABN, Publish Date - May 10 , 2025 | 12:32 PM

Operation Sindoor: భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు భీకరంగానే నడుస్తోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది.

Operation Sindoor

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంతో సరిహద్దు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్లు, కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. విమానయాన శాఖ ఏయిర్‌పోర్టులను సైతం మూసేసింది. యుద్ధ ప్రభావం సరిహద్దులతో పోల్చుకుంటే మిగిలిన ప్రాంతాల్లో లేదు. అయినప్పటికి ప్రజల్లో మాత్రం కొంత భయం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కొంత ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం అప్‌డేట్స్ కోసం టీవీలు, ఫోన్లలో న్యూసులు ఫాలో అవుతున్నారు.

అయితే.. వీటిలో రియల్ టైమ్.. అది కూడా అఫిషియల్ అప్‌డేట్స్ రావటానికి కొంత సమయం పడుతుంది. మీరు గనుక మీ ఫోన్‌లో ఓ చిన్న సెట్టింగ్ చేసుకుంటే.. యుద్ధం అప్‌డేట్స్‌ను రియల్ టైమ్‌లో మీ ఫోన్‌కు అలర్ట్స్ పొందొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.


ఆండ్రాయిడ్ ఫోన్‌లో..

  • ముందుగా సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి.

  • సెట్టింగ్స్‌లో సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీని క్లిక్ చేయండి. అలా కుదరకపోతే.. ‘ ఎమర్జెన్సీ అలర్ట్స్’ అని సెర్చ్ చేయండి.

  • అక్కడ వైర్‌లెస్ ఎమర్జన్సీ అలర్ట్స్‌పైన క్లిక్ చేయండి.

  • అందుబాటులో ఉన్న అన్ని అలర్ట్ ఆప్చన్లను యాక్టివేట్ చేసుకోండి.

( గమనిక.. ఫోన్ మోడల్‌ను కంపెనీని బట్టి పేర్లలో తేడా ఉండే అవకాశం ఉంటుంది. ‘ వైర్‌లెస్ ఎమర్జన్సీ అలర్ట్స్’ ఫోన్ కంపెనీని బట్టి అడ్వాన్స్‌డ్, మోర్ సెట్టింగ్స్‌లో లేదా సెల్ బ్రాడ్‌క్యాస్టింగ్‌లో ఉండే అవకాశం ఉంది)


ఐఫోన్‌లో ఇలా..

  • సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి, నోటిఫికేషన్‌లోకి వెళ్లండి.

  • బాగా కిందకు వచ్చి గవర్నమెంట్ అలర్ట్స్ అనే ఆప్చన్‌ను ఎంచుకోండి.

  • టెస్ట్ అలర్ట్స్‌ను క్లిక్ చేసి అప్‌డేట్స్ పొందొచ్చు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Updated Date - May 10 , 2025 | 12:32 PM