HPSL: ఐపీఎల్ తరహాలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్
ABN, Publish Date - May 26 , 2025 | 01:11 PM
HPSL: జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి జబల్‌పూర్‌కు తరలించిన 57 రేసు గుర్రాల్లో 8 మరణించాయి. అయిదు రోజుల వ్యవధిలో మృతి చెందాయి.
మధ్య ప్రదేశ్: గుర్రాల మరణాలు (Horse Deaths) కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) జబల్పూర్ (Jabalpur)కు అక్రమంగా గుర్రాలను తరలించారు. హైదరాబాద్ నుంచి 57 గుర్రాలను (57 Horses) జబల్పూర్‌కు తరలించారు. ఐపీఎల్ తరహాలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ (HPSL) నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి జబల్పూర్‌లోని సచిన్ తివారీ ఫార్మ్‌కు గుర్రాలను తరలించారు. 57 గుర్రాల్లో 8 గుర్రాలు జబల్పూర్‌లో మృతి చెందాయి. ఇప్పటికే గుర్రాల మృతిపై మధ్యప్రదేశ్ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. హెచ్‌పీఎస్ఎల్ (HPSL) నిర్వహణకు హైదరాబాద్ బిజినెస్‌మెన్ సురేష్ పాలడుగు సన్నాహాలు చేశారు.
జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి జబల్‌పూర్‌కు తరలించిన 57 రేసు గుర్రాల్లో 8 మరణించాయి. అయిదు రోజుల వ్యవధిలో మృతి చెందాయి. మరణించిన ఈ గుర్రాలన్నీ థోరోబ్రెడ్, కథియావారీ, మార్వారీ వంటి ప్రతిష్టాత్మక జాతులకు చెందినవి. ఏప్రిల్ 29, మే 5వ తేదీ మధ్య ఈ 57 గుర్రాలను రోడ్డు మార్గంలో జబల్ పూర్ జిల్లాలోని రాయ్‌పుర అనే గ్రామానికి తరలించారు. ఇక్కడికు వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని గుర్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. ఎనిమిది గుర్రాలు మరణించాయి. వాటి మరణం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యరు.
Also Read: టెక్నికల్ ప్రొబ్లామ్.. ఆలస్యంగా EAPCET పరీక్ష
గ్లాండర్స్ అనే అత్యంత అరుదైన అంటువ్యాధి బారిన పడి అవి మరణించి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మధ్యప్రదేశ్ పశు వైద్య అధికారులు అన్ని గుర్రాల రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హర్యానా హిసార్‌లోని నేషనల్ ఈక్విన్ రీసెర్చ్ సెంటర్‌కు పంపారు. ఇప్పటి వరకు 44 నమూనాలకు నెగెటివ్ అని తేలింది. మిగిలిన గుర్రాల శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ గుర్రాలను ఇంటర్ స్టేట్ మెడికల్ పర్మిషన్ లేకుండా తరలించారని, రవాణా సమయంలో ఆరోగ్య పర్యవేక్షణ కూడా సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భోపాల్ నుంచి ముగ్గురు సభ్యుల నిజ నిర్ధారణ బృందం ఈ నెల 17న రాయ్‌పురాను సందర్శించింది. ఈ టీమ్ ఇచ్చే నివేధిక త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్లాండర్స్ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా జబల్‌పూర్ జిల్లా యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్‌వర్క్
పబ్‌లో పార్టీ.. తెల్లారేసరికి యువకుడు మృతి..
For More AP News and Telugu News
Updated Date - May 26 , 2025 | 01:12 PM