Share News

Tirupati: 2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష

ABN , Publish Date - May 26 , 2025 | 12:22 PM

EAPCET Exam: ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన EAPCET పరీక్ష సర్వర్ ప్రొబ్లామ్‌తో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్యతో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు.

Tirupati: 2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష
EAPCET Exam

తిరుపతి: ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ (AP) ఈఏపీసెట్‌ పరీక్ష (EAPCET Exam) సోమవారం జరుగుతోంది. అయితే తిరుపతి (Tirupati)లో 2 గంటలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. పుత్తూరు (Puttur) ఎస్‌విపిసెట్ (SVPCET) కళాశాలలో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష సర్వర్ సమస్యతో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్య (Network Problems)తో పరీక్షలు ప్రారంభం ఆలస్యమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి 3 గంటలు పరీక్ష ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


కాగా కడప జిల్లా పబ్బాపురంలో మంగళవారం నుంచి తెలుగుదేశం మహానాడు సభలు జరగనున్న నేపథ్యంలో ఆ జిల్లాలోని 4 కేంద్రాల్లో ఏపీఈఏపీసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 7.30 గంటలలోపే చేరుకోవాలని ఈఏపీ సెట్‌ చైర్మన్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ సూచించారు. కడపలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, అన్నమాచార్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్సెస్‌, కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, కేఎల్‌ఎం కాలేజ్‌ ఫర్‌ ఉమెన్స్‌ల్లో ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు.

Also Read: దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్‌వర్క్


ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి మొత్తంగా 3,62,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇంజినీరింగ్‌ విభాగానికి 2,80,597 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి 81,832 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని జేఎన్టీయూ కాకినాడ వీసీ, ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ ప్రొ.సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని తమకు కేటాయించిన కంప్యూటర్‌ సరిగా పనిచేస్తుందో, లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకున్న వారికి కర్నూలు రీజనల్‌ సెంటర్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం కేటాయించినట్లు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పబ్‌లో పార్టీ.. తెల్లారేసరికి యువకుడు మృతి..

మావోయిస్టు మృత దేహాల తరలింపులో అడ్డంకులు...

For More AP News and Telugu News

Updated Date - May 26 , 2025 | 12:22 PM