ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Landslides: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న మాజీ సీఎం

ABN, Publish Date - Jul 13 , 2025 | 05:12 PM

ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. రోడ్డులోని కొంత భాగం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఎడతెరిపి లేని వర్షాలు బెంబేలెత్తెస్తున్నాయి. పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకోగా, మెరుపు వరదల హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లమ్బాథాచ్ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్తున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్‌ (Jairam Thakur)కు మండి ప్రాంతంలో తృటిలో ప్రమాదం తప్పంది. కొండ ప్రాంతం దాటుతుండగా కొండచరియలు విరుచుకుపడటంతో శిథిలాల మధ్య ఆయన కారు చిక్కుకుపోయింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన జైరామ్ ఠాకూర్ కారు దిగి మరి కొందరితో కలసి సురక్షితంగా ఆ ప్రాంతాన్ని దాటారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఘటన అనంతరం ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. రోడ్డులోని కొంత భాగం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని ఆందోళన చెందుతున్న స్థానికులు తాజాగా విరుచుకుపడుతున్న కొండచరియలతో వణికిపోతున్నారు. స్థానిక యంత్రాంగం, డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ బృందాలు స్థానికులను ఖాళీ చేసేందుకు మోహరించినప్పటికీ సహాయక కార్యక్రమాలకు వర్షాలు అంతరాయం కలిగిస్తున్నాయి.

సహాయక కార్యక్రమాలను త్వరిగతిన చేపట్టాలని జైరామ్ ఠాకూర్ అధికారులను కోరారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, అందరూ కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవాలని సూచించారు. కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో ప్రయాణాలకు దూరంగా ఉండాలని స్థానికులు, ప్రయాణికులను అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి..

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు

భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 05:19 PM