Share News

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:45 PM

కుల్గాం ప్రమాదంతో తాత్కాలికంగా అంతరాయం కలిగినప్పటికీ తిరిగి యాత్రా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు వాహనాల మధ్య తగినంత దూరం పాటించి కాన్వాయ్ ప్రోటాకాల్‌ను అనుసరించాలని అధికారులు సూచించారు.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం..  10 మందికి గాయాలు

కుల్గామ్: అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) లో ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రా కన్వాయ్‌లోని మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 10 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ ప్రాంతంలోని టాచ్లూ క్రాసింగ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. యాత్రికులు స్వల్పంగా గాయపడ్డారని, అంతా క్షేమంగా ఉన్నారని వైద్య అధికారులు ధ్రువీకరించారు.


కుల్గాం ప్రమాదంతో తాత్కాలికంగా అంతరాయం కలిగినప్పటికీ తిరిగి యాత్రా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు వాహనాల మధ్య తగినంత దూరం పాటించి కాన్వాయ్ ప్రోటాకాల్‌ను పాటించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాహనాలు ఢీకొనడానికి కారణాలపై విచారణ చేపట్టారు.


అమర్‌నాథ్ యాత్ర కోసం భాగవత్ నగర్ క్యాంపు నుంచి 7,048 మంది యాత్రికులతో కూడిన కొత్త బ్యాచ్ ఆదివారంనాడు జర్నీ ప్రారంభించింది. వీరిలో 1,423 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 136 మంది సాధువులు, సాధ్వీలు ఉన్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కాన్వాయ్‌లో యాత్రికులు ఉదయమే బయలుదేరారు. వీరిలో 4,158 యాత్రికులు పహల్లాం మార్గాన్ని ఎంచుకోవడంతో 148 వాహనాల కాన్వాయ్‌లో బయలుదేరారు. 2,891 మంది యాత్రికులు బాట్లా మార్గం గుండా 138 వాహనాల్లో బయలుదేరారు. 33 రోజుల వార్షిక అమర్‌నాథ్ యాత్ర జూలై 3న మొదలైంది. ఆగస్టు 9వ తేదీతో ముగుస్తుంది. ఇంతవరకూ అమర్‌నాథ్ గుహల్లోని మంచు శివలింగాన్ని 1.83 లక్షల మంది యాత్రికులు దర్శించుకున్నారు.


ఇవి కూడా చదవండి..

భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..

హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 02:51 PM