ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: పశ్చిమ కనుమల్లో ఆగని వర్షం..

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:55 PM

పశ్చిమకనుమలలో వర్షాలు ఆగడం లేదు. మలప్రభ నదికి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో బెళగావి జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి వద్ద నీరు పొంగిప్రవహిస్తోంది. కుసుమళి గ్రామం వద్ద నదికి అడ్డంగా బ్రిడ్మ్‌ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు రావడంతో ఇబ్బందికరం ఏర్పడింది. కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది.

- బెళగావి సమీపంలో కుంగిన రోడ్డు

- గోవా ప్రయాణానికి బ్రేక్‌

- నగరంలోనూ వాన జోరు

బెంగళూరు: పశ్చిమకనుమలలో వర్షాలు ఆగడం లేదు. మలప్రభ నదికి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో బెళగావి(Belagavi) జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి వద్ద నీరు పొంగిప్రవహిస్తోంది. కుసుమళి గ్రామం వద్ద నదికి అడ్డంగా బ్రిడ్మ్‌ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు రావడంతో ఇబ్బందికరం ఏర్పడింది. కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో బెళగావి నుంచి జాంబోటె-చోర్ల మార్గంగా గోవాకు వెళ్లే రహదారి స్తంభించినట్టయ్యింది.

పాత బ్రిడ్జ్‌ను తొలగించి కొత్త బ్రిడ్జ్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో తాత్కాలికంగా మట్టిరోడ్డును నిర్మించి సంచారానికి అనుకూలం చేశారు. నీరు ఎక్కువగా రావడంతో మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. బెళగావి నుంచి గోవాకు ఖానాపుర(Khanapur), రామనగర మార్గంగా మళ్లించారు. మరోవైపు బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తయ్యేదాకా సమస్య కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

బెంగళూరులో...

బెంగళూరు వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం వర్షంతో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల ప్రజలు తడిసిముద్దయ్యారు. విధానసౌధ, ఎంజీ రోడ్డు, ఆర్‌టీనగర్‌, బళ్ళారిరోడ్డు నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలో వర్షం కురిసింది.

ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 10 , 2025 | 12:55 PM