ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ghulam Nabi Azad: ప్రపంచంలో కంటే.. పాకిస్థాన్‌లోనే ఉగ్రవాదులు అధికం

ABN, Publish Date - May 26 , 2025 | 12:28 PM

పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ వైఖరిని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాలని భారత్ నిర్ణయించింది.

Ghulam nabi azad in bahrain

న్యూఢిల్లీ, మే 26: ప్రపంచంలో నివసిస్తున్న ఉగ్రవాదుల కంటే.. పాకిస్థాన్‌లోనే ఉగ్రవాదులు అత్యధికంగా నివసిస్తున్నారని డెమెక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. బీజేపీ ఎంపీ వైజయంతి పాండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. ఆ బృందంలో సభ్యుడైన మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. బహ్రెయిన్‌లో ప్రతి మతం వారు నివసిస్తున్నారన్నారు. ఈ దేశం చిన్న భారతదేశంలాగా కనిపిస్తుందని చెప్పారు. ఇక్కడ నివసిస్తున్న వారికి ఎటువంటి పరిమితులు లేవన్నారు.

భారత్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారమైన మనం.. ఈ దేశానికి కేవలం భారతీయులుగానే వచ్చామని చెప్పారు. ఇక పాకిస్థాన్ మతం ఆధారంగా ఏర్పడిన దేశమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఆ దేశంలో ఐక్యత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు పాకిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్‌లు సైతం కలిసి ఐక్యంగా ఉండలేదని వివరించారు. కానీ భారత దేశం అలా కాదన్నారు. అన్ని మతాల వారు కలిసి ఐక్యంగా జీవిస్తారని చెప్పారు.


అలాగా దేశంలో ప్రజలు మత సామరస్యంతో జీవిస్తారన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో సైతం ప్రధాని నరేంద్ర మోదీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. ఆ జాబితాలో పాకిస్థాన్‌ సైతం ఉందన్నారు. కానీ ఉగ్రవాద దాడులపై ప్రతి సారి ప్రధాని మోదీ.. పాకిస్థాన్‌తో మాట్లాడేవారన్నారు. అలాంటి సమయంలో సైతం పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లో ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయన్నారు.


ఇక పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు జరిపిందని చెప్పారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులే మరణించారని.. ప్రజలు కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ పాక్ మాత్రం భారత్ సరిహద్దుల్లోని భూభాగంపై ప్రజలే లక్ష్యంగా దాడులు చేసిందని గులాం నబీ ఆజాద్ వివరించారు.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తీరును ప్రపంచదేశాల ఎదుట భారత్ ఎండగట్టే ప్రయత్నాన్ని చేపట్టింది. అందులోభాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలు.. వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వైజయంతి పాండే నేతృత్వంలోని ఓ బృందం బహ్రెయిన్‌లో పర్యటిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగ్లాదేశ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు

దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

For National News And Telugu News

Updated Date - May 26 , 2025 | 12:29 PM