Share News

CM Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 26 , 2025 | 11:15 AM

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ ఇటీవల చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోని చికెన్ నెక్ అంశంపై ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు.

CM Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు
Assam Chief Minister Himanta Biswa Sarma

అసోం, మే 26: భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోని చికెన్ నెక్‌ ప్రాంతంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ యూనస్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆదివారం స్పందించారు. ఆ క్రమంలో బంగ్లాదేశ్‌కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అవి అత్యంత దుర్భలమైనవిగా ఆయన అభివర్ణించారు.

బంగ్లాదేశ్‌లో ఈ రెండు చికెన్ నెక్ ప్రాంతాలున్న ఫొటోను ఆయన ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా వాటి వివరాలను సైతం ఆయన సోదాహరణగా వివరించారు. మొదటి చికెన్ నెక్.. ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ నుంచి నైరుతీ గారో హిల్స్ వరకు ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్య తలెత్తినా.. బంగ్లాదేశ్‌తో రంగ్‌పూర్ డివిజన్‌కు ఉన్న సంబంధాలు తెగిపోతాయని చెప్పారు.


అలాగే రెండో చికెన్ నెక్.. చిట్టిగంగ్ కారిడార్‌‌లో 28 కిలోమీటర్ల మేర ఉందన్నారు. ఇది దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు ఉందని వివరించారు. ఇది భారత్ చికెన్ నెక్ కంటే చిన్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక రాజధానిని.. రాజకీయ రాజధానిని అనుసంధానం చేస్తుందన్నారు.


అయితే కొందరు భౌగోళిక వాస్తవాలను మరిచిపోతున్నారని.. అలాంటి వారికి గుర్తు చేస్తున్నానంటూ సీఎం శర్మ పరోక్షంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్‌కు చురకలంటించారు. ఆ క్రమంలోనే భారత్‌లోని సిలిగురి కారిడార్‌లాగే బంగ్లాదేశ్‌లో రెండు ఇరుకైన కారిడార్లు ఉన్నాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇటీవల చైనాలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ పర్యటించారు. ఈ సందర్భంగా భారతలోని ఈశాన్య ప్రాంతంలోని చికెన్ నెక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు కౌంటర్‌గా అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మపై విధంగా స్పందించారు.


భారత్‌లోని సిలిగురి కారిడార్‌ను చికెన్ నెక్‌గా వ్యవహరిస్తారు. భారత్‌లో కేవలం 22 నుంచి 35 కిలోమీటర్ల మేర వెడల్పుగా ఉండే ఈ భూభాగాన్ని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఇది భారత్‌ను ఈశాన్య ప్రాంతాన్ని కలుపుతోందన్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

For National News And Telugu News

Updated Date - May 26 , 2025 | 11:18 AM