Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
ABN, Publish Date - Apr 24 , 2025 | 10:40 AM
Gautam Gambhir: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంపై స్పందిన భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కాశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మిమ్మల్ని చంపేస్తామంటూ ఈ మెయిల్ ద్వారా త నకు బెదిరింపులు అందాయని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంపై స్పందించిన భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కాశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మిమ్మల్ని చంపేస్తామంటూ ఈ మెయిల్ ద్వారా ఆయనకు బెదిరింపులు అందాయి. దీంతో ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ ఫిర్యాదులో ఢిల్లీ పోలీసులను గౌతమ్ గంభీర్ కోరారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరునాడే గౌతమ్ గంభీర్‌కు ఈ మెయిల్ ద్వారా ఇలా బెదిరింపులు అందడం గమనార్హం.
బుధవారం మధ్యాహ్నం తనకు ఓ ఈ మెయిల్ అందిందని గౌతమ్ గంభీర్ చెప్పారు. అందులో ఐ కిల్ యూ అని సందేశం ఉందన్నారు. అదే రోజు సాయంత్రం మరో ఈ మెయిల్ తనకు వచ్చిందని తెలిపారు. అందులో సైతం అదే సందేశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే 2021, నవంబర్‌లో కూడా గౌతమ్ గంభీర్‌కు ఇదే తరహాలో బెదిరిస్తూ ఈ మెయిల్ వచ్చిన విషయం విదితమే.
మరోవైపు గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మార్చి 22వ తేదీ పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈ దారుణంపై పలువురు క్రికెటర్లు స్పందించారు. వారిలో గౌతమ్ గంభీర్ సైతం ఉన్నారు. ఆయన ఏమన్నారంటే.. తాను మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానన్నారు. దీనికి బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని. భారత్ తీవ్రంగా స్పందిస్తుందని బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు
Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
For National news And Telugu News
Updated Date - Apr 24 , 2025 | 11:07 AM