Gaganyaan Mission: గగన్‌యాన్ వ్యోమగామియుద్ధానికి సిద్ధం
ABN, Publish Date - May 09 , 2025 | 05:24 AM
గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను తిరిగి వాయుసేన పిలిపించింది. 2027లో గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అజిత్‌తోపాటు ఇతర వైమానిక దళ అధికారులు కూడా ఎంపికయ్యారు.
అజిత్ కృష్ణన్‌ను వెనక్కి పిలిపించిన వాయుసేన
న్యూఢిల్లీ, మే 8: ఆపరేష న్ సిందూర్ అనంతరం భా రత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను వాయుసేన తిరిగి తన యూనిట్‌కు పిలిపించింది. దేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు వైమానిక దళ అధికారుల్లో గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ ఒకరు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తనకు ఐఏఎఫ్ నుంచి పిలుపొచ్చిందని ధ్రువీకరించారు. 2027లో నిర్వహించే గగన్‌యాన్ మిషన్ కోసం అజిత్‌తోపాటు వాయుసేనకు చెందిన అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా, ప్రశాంత్ బి నాయర్ ఎంపికయ్యారు. 2003లో ఐఏఎఫ్‌లో చేరిన అజిత్‌కు ఎస్‌యూ-30, ఎంకేఐ, మిగ్-29 తదితర యుద్ధ విమానాల్లో దాదాపు 2,900 గంటలు ప్రయాణించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన వాయుసేనలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, టెస్ట్ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Updated Date - May 09 , 2025 | 05:26 AM