Pahalgam Terror Attack: పహల్గాం దాడి వెనుక హమాస్ హస్తం ఉందా..
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:30 PM
Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తంతోపాటు మరో ఉగ్రవాద సంస్థ హస్తం సైతం ఉందా? అంటే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వెనుక ఇజ్రాయెలపై దాడి చేస్తున్న హమాస్ హస్తం సైతం ఉందని సమాచారం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడికి కారణంగా 26 మంది మరణించారు. అయితే గతేడాది ఇజ్రాయెల్‌లో జరిగిన హమాస్ తరహాలో ఈ దాడి జరిగిందని నిఘా వర్గాలు ఈ సందర్భంగా పేర్కొంటున్నాయి. ఈ తరహా దాడులతో భారతదేశాన్ని అస్థిర పరచడమే కాకుండా ఇతర దేశాలను సైతం ఆవిధంగా చేస్తున్నాయని తెలిపాయి.
ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని.. వారిలో ఇద్దరు పాకిస్థానీయులు కాగా.. మరో ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారని పేర్కొన్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శిక్షణ పొందారని వెల్లడించాయి. వీరికి పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ వెన్ను దన్నుగా ఉన్న లష్కరే తోయిబాతోపాటు జైషే మహమ్మద్ సంస్థలు శిక్షణ ఇచ్చాయన్నాయని వివరించాయి.
పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 5వ తేదీన హమాస్ నాయకులు ఆ దేశానికి వెళ్ళారని నిఘా వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి పాక్ అక్రమిత కాశ్మీర్‌కు తీసుకు వెళ్లారని చెప్పాయి. ఈ సందర్భంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన కమాండర్లతో ఈ హమాస్ నాయకులు సమావేశవమయ్యారని తెలిపాయి. ఈ హమాస్ నాయకుల పర్యటన సందర్భంగా రావాలాకోట్‌లో ఓ ర్యాలీ సైతం నిర్వహించారని వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కీలక నాయకులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, లాంచ్ కమాండర్ అస్గర్ ఖాన్ కాశ్మీరీ, మసూద్ ఇలియాస్‌తోపాటు పలువురు లష్కరే తోయిబా కమాండర్లు సైతం దీనికి హాజరయ్యారని నిఘా వర్గాలు ఈ సందర్భంగా వివరించాయి.
ఢాకా సమావేశం: ఈశాన్య భారతంతో తీవ్రవాదం ముడి పడి ఉందా?
గత ఏడాది అక్టోబర్ 7న వచ్చిన మరో నిఘా సమాచారం ప్రకారం.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించే లక్ష్యంతో ఇలాంటి రాడికల్ భావజాలాన్ని నాటే ప్రయత్నం కోసం హమాస్ నాయకులను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఢాకా తీసుకు వెళ్లిందని సమాచారం.అల్ ఖైదాతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రముఖ తీవ్రవాది ముఫ్తీ షాహిదుల్ ఇస్లాం స్థాపించిన ఇస్లామిస్ట్ సంస్థ 'అల్ మర్కజుల్ ఇస్లామి' ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
1999లో ఖుల్నాలోని అహ్మదియా మసీదుపై బాంబు దాడికి కుట్ర పన్నినందుకుగాను ముఫ్తీ షాహిదుల్లా ఇస్లాంను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. ఆ తర్వాత అతడు విడుదలై.. ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్‌తోపాటు ఆఫ్రికా వెళ్లాడు. అక్కడ అల్ ఖైదాకు చెందిన వ్యక్తుల వద్ద పేలుడు పదార్థాల శిక్షణ పొందాడు. అయితే అతడు 2023లో మరణించాడు. కానీ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) వంటి తీవ్రవాద సంస్థలు షాహిదుల్ ఇస్లాంను ఇప్పటికీ ఆరాధిస్తునే ఉన్నాయి.
గతేడాది ఢాకాలో అక్టోబర్‌లో జరిగిన కార్యక్రమానికి సీనియర్ హమాస్ నాయకులు షేక్ ఖలీద్ కుదుమితోపాటు పొలిటికల్ బ్యూరో చైర్మన్ షేక్ ఖలీద్ మిషాల్ హాజరయ్యారు. ఇతర ప్రముఖ హాజరైన వారిలో పాకిస్తాన్‌కు చెందిన షేఖుల్ ఇస్లాం ముఫ్తీ తకీ ఉస్మానీ, మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ఉన్నారు. వీరిద్దరు రాడికల్ వర్గాలలో ప్రముఖులుగా ప్రసిద్ధి పొందారు.
మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌ను దౌత్యపరంగా, ఆర్థికంగా ఏకాకి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందుకోసం సైనిక ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.
పాకిస్తాన్‌ను దౌత్యపరంగా , ఆర్థికంగా ఒంటరిగా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంది. మరోవైపు భారతదేశంతో సంఘీభావం ప్రకటించిన మొదటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి - హమాస్ చేతిలో నష్టపోయిన దేశం కూడా ఇజ్రాయెల్ కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించిన వెంటనే ఈ మద్దతు లభించింది. ఇజ్రాయెల్ మద్దతు ఉమ్మడి ఉగ్రవాద ముప్పుకు వ్యతిరేకంగా రెండు దేశాల మధ్య ఐక్యత యొక్క దృఢమైన సందేశంగా భావించబడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Amit Shah: సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. ఎందుకంటే..
Pahalgam Terror Attack: ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సూచన
Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..
Pahalgam terror attack: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. నిందితుడు అరెస్ట్
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల వివరాలందిస్తే.. భారీ నజరానా
For National News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 04:38 PM