ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

VS Achuthanandan: మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూత

ABN, Publish Date - Jul 21 , 2025 | 05:05 PM

కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ మృతి చెందారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

Former Kerala CM VS Achuthanandan

తిరువనంతపురం, జులై 21: కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. గత నెల 23వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అచ్చుతానందన్. దీంతో తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు ఆయన్ని తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. వామపక్ష పార్టీలో చీలిక వచ్చిన అనంతరం సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1923, అక్టోబర్ 20వ తేదీన కేరళలో వెనుకబడిన ఒక నిరుపేద కుటుంబంలో అచ్యుతానందన్ జన్మించారు.

బాల్యంలో పేదరికం కారణంగా.. ప్రాథమిక స్థాయిలోనే ఆయన చదువును ఆపేశారు. అనంతరం బట్టలు కుట్టడం, కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పని చేశారు. ఆ తర్వాత కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యారు. అనంతరం ట్రావెన్‌కోర్ సంస్థానానికి చెందిన భూస్వాములపై పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారు. ఆ తర్వాత 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను ఆయన వదిలేశారు. అనంతరం సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1967 నుంచి 2016 వరకూ వరుసగా అసెంబ్లీకి ఆయన ఎన్నికైయ్యారు. ఆ క్రమంలో మూడు సార్లు విపక్షనేతగా.. ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేశారు అచ్యుతానందన్. అవినీతికి వ్యతిరేకంగా అచ్యుతానందన్ పోరాటం చేశారు. రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలతో అనేక మంది రాజకీయంగా దూరం జరిగినా.. వాటిని ఆయన పట్టించుకోలేదు.

సీఎం చంద్రబాబు..

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీ వి.ఎస్.అచ్యుతానందన్ మృతికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఎనిమిది దశాబ్దాలుగా సాగిన ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ఆయన ఆదర్శాలు, ప్రజా సేవ పట్ల దృఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ సైతం కేరళ మాజీ సీఎం మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంతాపం..

కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పని చేసి.. ఆదర్వ నేతగా ఆచ్యుతానందన్ నిలిచారని ఈ సందర్బంగా కొనియాడారు. రాజకీయ జీవితాన్ని ఎంతో స్ఫూర్తిమంతంగా గడిపారన్నారు. మూడుసార్లు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. సీపీఎం వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజల పక్షాన పోరాడిన ఆయన జీవితం.. అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. అచ్యుతానందన్ కుటుంబసభ్యులకు, ఆయన అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు సైతం సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి..

సీఎంకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

పిఎమ్ఎస్‌హెచ్‌ఆర్‌ఐ పథకం కింద రాష్ట్రానికి మరిన్ని పాఠశాలలు: కేంద్ర మంత్రి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 07:52 PM