ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thunag Flood Disaster: వరదల్లో మునిగిన బ్యాంక్.. నగదు, ఆభరణాల గురించి కస్టమర్ల ఆందోళన

ABN, Publish Date - Jul 07 , 2025 | 07:30 PM

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఓ బ్యాంకులోకి భారీగా వరద నీరు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ కూలిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకులో భద్రపరిచిన పత్రాలు, నగదు విపత్తుల తాకిడితో దెబ్బతిన్నాయి. దీంతో ఈ బ్యాంకులో మనీ, గోల్డ్ దాచుకున్న కస్టమర్లు ఆందోళన (Thunag Flood Disaster) చెందుతున్నారు.

Thunag Flood Disaster

హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు (Himachal Pradesh flood) దంచికొడుతున్నాయి. దీంతో మంచి జిల్లాలోని థునాగ్‎లో (Thunag) ఉన్న స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ నీట మునిగింది (Bank Cash Submerged). ఈ రెండంతస్తుల బ్యాంక్ భవనం మొదటి అంతస్తు పూర్తిగా నీరు, శిథిలాలతో నిండిపోయింది. వరద నీటి కారణంగా ఒక వైపు షట్టర్ పూర్తిగా ఊడిపోగా, మిగిలిన రెండు షట్టర్లు వంకర తిరిగాయి. బ్యాంక్‌లో ఉన్న నగదు, ముఖ్యమైన పత్రాలు, లాకర్లలోని లక్షల విలువైన ఆభరణాలు అన్నీ శిథిలాల కింద చిక్కుకుపోయాయి. అయితే ఎంత నష్టం జరిగిందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

వ్యాపారుల ఆందోళన.. (Thunag Flood Disaster)

కానీ కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగినట్లు అంచనా. శిథిలాలు తొలగించిన తర్వాత ఎంత నష్టం జరిగిందనేది తెలుస్తుంది. థునాగ్ మార్కెట్ మధ్యలో ఉన్న ఈ బ్యాంక్‌లో 150 మంది వ్యాపారుల ఖాతాలు ఉన్నాయి. ఈ పట్టణంలో ఎనిమిది వేల జనాభాకు ఇది ఒక్కటే బ్యాంక్. ఈ బ్యాంక్ చాలా పాతదని, రోజూ చాలా లావాదేవీలు జరుగుతాయని స్థానిక వ్యాపారి హరి మోహన్ అన్నారు. కానీ వరదల కారణంగా నగదు, పత్రాలు, లాకర్లు అన్నీ శిథిలాల కింద చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

78 మంది మృతి..

ఈ విపత్తు ఈ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. వరదల్లో కొట్టుకుపోయిన విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉండటంతో, కొందరు స్థానికులు బ్యాంక్‌ను రక్షించేందుకు కాపలాగా ఉన్నారు. జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా 23 చోట్ల వరదలు, 16 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తుల్లో 78 మంది మరణించారు.

మళ్లీ వర్షాలు..

వీరిలో 50 మంది వర్షం సంబంధిత ఘటనల్లో, 28 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. 37 మంది తప్పిపోయారు, 115 మంది గాయపడ్డారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం జూలై 8, 9 తేదీల్లో కూడా ఈ రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, షిమ్లా, సోలన్, హమీర్‌పూర్, బిలాస్‌పూర్, ఉనా, కులు, చంబా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 08:11 PM