Minister: ఆ విషయంలో.. సీఎందే తుది నిర్ణయం
ABN, Publish Date - Aug 13 , 2025 | 10:31 AM
కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌దే తుది నిర్ణయమని పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పష్టంచేశారు.
- పారిశుధ్య కార్మికుల పర్మినెంట్ అంశంపై మంత్రి కేఎన్ నెహ్రూ
చెన్నై: కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌దే తుది నిర్ణయమని పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ(Minister KS Nehru) స్పష్టంచేశారు. తిరుచ్చిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రేషన్ సరుకుల కోసం గతంలో ప్రజలు చౌకదుకాణాల ముందు వేచివున్న పరిస్థితిని ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) మార్చి ఇంటివద్దకే రేషన్ సరుకులు అందజేసే పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. సుమారు 88వేల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్దిపొందారని తెలిపారు.
జీసీసీలో నిర్వదిక సమ్మె కొనసాగిస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులతో చర్యలు జరుపుతున్నామని, ఈ సమస్యను సున్నితంగా పరిష్కరింపజేసేందుకు సీఎం చర్యలు చేపట్టారన్నారు. జీసీసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సంబంధించిన న్యాయస్థానంలో దాఖలైన కేసు తీర్పు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు.
కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు ఒక్కరోజులో పరిష్కరించడం సాధ్యంకాదని, వారి అవసరాలను తీర్చడంతో పాటు పర్మినెంట్ చేయడంపై సీఎం నిర్ణయిస్తారని మంత్రి పేర్కొన్నారు. వీధి కుక్కల బెడదలేకుండా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పు నకలు అందిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమలుపరుస్తామన్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కోపథకాన్ని అమలుపరుస్తున్నామని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు డీఎంకే ప్రభుత్వంపై బురదజల్లేలా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 13 , 2025 | 10:31 AM