ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BSF Jawan: మా బిడ్డను కాపాడండి

ABN, Publish Date - Apr 26 , 2025 | 03:09 AM

పాక్‌ చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాను పూర్ణం సాహూ పరిస్థితిపై సమాచారం లేక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ కేంద్రాన్ని వేడుకుంటున్నారు

పాక్‌ చెరలో ఉన్న జవాను పట్ల తల్లిదండ్రుల ఆందోళన

హూగ్లీ, ఏప్రిల్‌ 25: పాక్‌ చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాను, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పూర్ణం సాహూ క్షేమ సమాచారం తెలియక ఆయన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డను ఎలాగైనా విడిపించి.. క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ భారత ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు. పూర్ణం సాహూ సెలవుల్లో ఇంటికొచ్చి మూడు వారాల క్రితమే విధుల్లో చేరాడని.. తమ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని తండ్రి బోలేనాథ్‌ సాహూ ఆవేదన వ్యక్తం చేశాడు. కుమారుడు క్షేమంగా ఉన్నాడా? బతికే ఉన్నాడా? అనేదానిపై ఎవ్వరూ సమాచారం ఇవ్వడం లేదన్నారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పూర్ణం సాహూ దాయాది చేతికి చిక్కడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - Apr 26 , 2025 | 03:09 AM