Bengaluru: ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు
ABN, Publish Date - Aug 14 , 2025 | 12:57 PM
ధర్మస్థలలో 13వ పాయింట్‌లో జీపీఆర్ టెక్నాలజీ స్కానింగ్ చేసిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రక్రియ కొనసాగింది. ఓవైపు వర్షం కురుస్తున్నా తవ్విన ప్రాంతంలో నీరు వస్తుండడంతో మోటార్లతో తొలగించి ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
బెంగళూరు: ధర్మస్థల(Dharmasthala)లో 13వ పాయింట్‌లో జీపీఆర్ టెక్నాలజీ స్కానింగ్ చేసిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రక్రియ కొనసాగింది. ఓవైపు వర్షం కురుస్తున్నా తవ్విన ప్రాంతంలో నీరు వస్తుండడంతో మోటార్లతో తొలగించి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా అదే పాయింట్‌లో తవ్వకాలు కొనసాగించారు. ధర్మస్థళలో మృతదేహాలు పాతిపెట్టారని మాకూ సమాచారం ఉందని స్థానికులు పురందరగౌడ, తుకారాంగౌడలు బుధవారం సిట్ కార్యాలయానికి వచ్చారు. పురందరగౌడ మాట్లాడుతూ నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఓ దుకాణం నిర్వహించేవాడినన్నారు.
మృతదేహాలను ఓ వ్యక్తి పూడ్చిపెట్టడం చూశానన్నారు. ఇదే వ్యక్తి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. వారిద్దరునుంచి కూడా పోలీసులు ఆధారాలు తీసుకున్నారు. కాగా అనన్యభట్ తల్లి సుజాతభట్ ఇటీవల సిట్ అధికారులను కలసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న అనన్యభట్ ధర్మస్థల సందర్శనకు వచ్చి ఆ తర్వాత మృతి చెందారనే విషయమై తల్లి ఫిర్యాదు చేశారు. సిట్ అధికారులను కలసిన తర్వాత సుజాతభట్ కనిపించకుండా పోయారని ప్రచారం సాగింది. దీంతో సుజాతభట్ బుధవారం అజ్ఞాతస్థలం నుంచి వీడియోద్వారా వివరణ ఇచ్చారు.
నేనెక్కడికీ వెళ్లలేదని తేల్చి చెప్పారు. కుమార్తె అనన్యభట్‌కు సంబంధించిన ఆనవాళ్లు లభిస్తే హిందూ సంప్రదాయం క్రారం ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ధర్మస్థళకు ఉండే మంచిపేరును చెడగొట్టేందుకు కుట్ర పన్నారని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. బెళగావి జిల్లా చిక్కోడి, బెళగావిలలో మహిళలు ఆందోళన చేశారు. ముస్లిం మహిళలు కూడా పాల్గొన్నారు. చిక్కోడి నగరంలో బంద్ చేస్తామని హెచ్చరించారు. బెళగావి, చామరాజనగర, గదగ్, కలబురగి, మైసూరు, తుమకూరులలో ఆందోళనలు కొనసాగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 14 , 2025 | 12:57 PM