EPS: ఏం డౌట్ లేదు.. సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం..
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:25 AM
బీజేపీ తదితర పార్టీల కలయికతో ఏర్పడిన పొత్తు పటిష్టమని, సొంత బలంతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మాజీముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) మరోమారు ధీమా వ్యక్తంచేశారు.
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ ధీమా
చెన్నై: బీజేపీ తదితర పార్టీల కలయికతో ఏర్పడిన పొత్తు పటిష్టమని, సొంత బలంతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మాజీముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) మరోమారు ధీమా వ్యక్తంచేశారు. సేలం అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఉదయం ప్రారంభించిన ఈపీఎస్ అక్కడినుంచి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు.
ఈ సందర్భంగా ఈపీఎస్ మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే కూటమి ఏకాభిప్రాయంతో దృఢంగా, విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉందని, అందువల్ల 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించి తీరుతుందని అన్నాడీఎం సొంత బలంతోనే అధికార పీఠమెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 7వ తేదీ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ పేరిట చేపట్టిన ఎన్నికల ప్రచార పయనంలో తాను ఇప్పటివరకు పర్యటించిన నియోజకవర్గంలో ప్రజలు తనను ఆహ్వానించిన తీరు, మద్దతు కొత్త ఉత్సాహం, ఉత్తేజాన్ని కలిగించిందని, అధికార డీఎంకేను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమైనట్లు స్పష్టమైందన్నారు. మంగళవారం ప్రారంభించినున్న ‘ఉంగల్ ఉడన్ స్టాలిన్’ పథకం హాస్యాస్పదంగా ఉందని,
ప్రజలను, ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టేందుకు డీఎంకే కొత్త నాటకానికి తెరతీయనుందని ఈపీఎస్ విమర్శించారు. అదేవిధంగా నాలుగేళ్ళకు పైగా అధికారంలో కొనసాగుతున్న డీఎంకే ప్రభుత్వ తరుఫున పథకాలను సక్రమంగా ప్రజలకు చేర్చలేదని, అందువల్లే సమాచారశాఖలో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిందని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వం వచ్చాక అన్నిశాఖల్లో జరిగిన డీఎంకే అవినీతిపై విచారణ జరుపుతామని ఈపీఎస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News
Updated Date - Jul 15 , 2025 | 11:25 AM