ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India Plane crash: ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ: కేంద్ర మంత్రి

ABN, Publish Date - Jun 12 , 2025 | 07:49 PM

ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన వార్త విని తాను షాక్‌కు గురయ్యానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటన జరగిన వెంటనే గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు.

Central Minister K Rammohan naidu

అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటన మహావిషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ విమాన ప్రమాద ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం విమాన ప్రమాద ఘనట చోటు చేసుకున్న ప్రదేశానికి ఆయన చేరుకుని.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. విమాన ప్రమాద ఘటన తీరును ఉన్నతాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసమే తాను అహ్మదాబాద్ వచ్చినట్లు తెలిపారు. ఈ విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. అన్ని విభాగాల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.

విమాన ప్రమాదం ఎందుకు జరిగిందో దర్యాప్తు చేస్తామన్నారు. విమాన ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని కేంద్రం మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే మృతుల సంఖ్యలను కనుగోనవలసి ఉందిని ఉందన్నారు. ఈ విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధగా ఉందని తెలిపారు.

ఈ విమానంలో ఇతర దేశాలకు చెందిన జాతీయులు సైతం ఉన్నారని చెప్పారు. ఈ విషాదకరమైన, భయంకరమైన సంఘటనతో తాను పూర్తిగా షాక్ అయ్యానన్నారు. తాను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ తనకు ఫోన్ చేసి సంఘటన స్థలంలో ఉండమని కోరారని వివరించారు. ఈ సమయంలో, నేను ప్రయాణీకులు, వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించగలనన్నారు. అనేక సంస్థలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని గుర్తు చేశారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తున్నామన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన సైతం సంఘటన స్థలానికి వచ్చారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 07:49 PM