Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పలువురు మావోయిస్టులు మృతి
ABN, Publish Date - Jun 05 , 2025 | 02:10 PM
ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మరణించారు. వారిలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాయ్‌పూర్, జూన్ 05: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు కీలక మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి.
ఈ విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ ఉన్నారు. ఆయన తలపై రూ. కోటి రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం ఆయన స్వగ్రామం. కాగా, ఈ ఘటనలో పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లలో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ప్రభుత్వం ఎదుట మరికొంతమంది మావోలు లొంగిపోయారు. మరోవైపు ఇంకొంతమంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చట్టసభ సభ్యులకు ఎలాన్ మాస్క్ కీలక సూచన
మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాల్సింది: బీసీసీఐ
For National News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 05:44 PM