Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
ABN, Publish Date - May 23 , 2025 | 10:11 AM
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా మూడో రోజు ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూబింగ్ నిర్వహించారు.
రాయ్‌పూర్, మే 23: ఛత్తీస్‌గఢ్‌లోని వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తుంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు పలువురు కీలక నేతలు సైతం ఉన్నారు. నంబాల కేశవరావుపై రూ. కోటిన్నర రివార్డు ఉన్న సంగతి తెలిసిందే.
2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో వారి ఏరివేతకు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఆ రాష్ట్రంలో తరచూ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోతే.. మరికొందరు అరెస్టయిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌పై పాక్ మిలటరీ అధికారి సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో మళ్లీ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా..!
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 10:11 AM