ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: చైనా కాదు.. ఎట్టకేలకు భారత్ రానున్న ఎలాన్ మస్క్..కారణమిదేనా..

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:43 PM

టెక్ ప్రపంచ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎట్టకేలకు భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన మస్క్ పర్యటన ఈసారి ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మస్క్ ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Elon Musk Visit India

ప్రపంచంలోనే అత్యంత టెక్ బిలియనీర్లలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk), ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత తెలుపడం విశేషం. ఇది అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విషయంలో కీలకం కానుంది. దురదృష్టవశాత్తు, టెస్లాలో పనిభారం కారణంగా భారతదేశ పర్యటన ఆలస్యం అయిందన్నారు. కానీ ఈ సంవత్సరం చివర్లో జరిగే పర్యటన కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా వెల్లడించారు.


అనేక సార్లు వాయిదా

ఎలాన్ మస్క్ భారత పర్యటన ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. వాస్తవానికి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 21-22 తేదీలలో భారతదేశానికి రావాల్సి ఉంది. కానీ ఎలాన్ మస్క్ ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారతదేశంలో ఉంటారని ముందుగా వార్తలు వచ్చాయి. ఈ సమయంలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని, దీంతో పాటు, టెస్లా CEO, అతని బృందం ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులను కలుస్తారని వార్తలొచ్చాయి. కానీ ఇవి ఖరారు కాలేదు. దీనికి ముందు కూడా మస్క్ భారత్ పర్యటన పలు మార్లు వాయిదా పడింది.


మోదీ, మస్క్ రెండుసార్లు భేటీ

ఈ క్రమంలో ఎలాన్ మస్క్ వచ్చే పర్యటన భారతదేశానికి మొదటి సందర్శన అవుతుంది. ఈ సమయంలో మస్క్ భారతదేశంలో టెస్లా తయారీ కర్మాగారం గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మోదీ, మస్క్ ఇప్పటివరకు రెండుసార్లు కలిశారు. వీరిద్దరూ 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా ఫ్యాక్టరీలో కలిశారు. ఆ తర్వాత జూన్ 2023లో న్యూయార్క్‌లో కలుసుకున్నారు. ఎలాన్ మస్క్ భారతదేశంలో 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి గురించి ప్రణాళికలను ప్రకటించనున్నారు.


టెస్లాతోపాటు..

టెస్లా భారతదేశంలో కార్లను తయారు చేయడమే కాకుండా, ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. మరోవైపు చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ టెస్లా కార్ల తయారీకి ఇప్పుడు భారత్ మంచి అవకాశమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతోపాటు ఇండియాలో తయారు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఐఫోన్లను తయారు చేస్తున్న భారత్, త్వరలో టెస్లా కార్లను కూడా సిద్ధం చేయనుంది. ఇది కాకుండా, మస్క్ త్వరలో భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించవచ్చు. స్టార్‌లింక్‌కు నియంత్రణ అనుమతులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ కంపెనీ లైసెన్స్ పొందే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి:


Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 19 , 2025 | 09:15 PM