ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EPS: ఈసారి వచ్చేది మేమే.. మాకు ప్రజాదరణ అపారం

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:07 AM

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ పాలనా తీరుకు వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ అపారమని, అధికారంలోకి రాబోయేది తామేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.

  • మాకు ప్రజాదరణ అపారం

  • కోవై ప్రచార సభలో ఈపీఎస్‌

చెన్నై: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ పాలనా తీరుకు వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ అపారమని, అధికారంలోకి రాబోయేది తామేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswamy) ధీమా వ్యక్తం చేశారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకునేందుకు ఈపీఎస్‌ తన పర్యటన రోడ్‌మ్యా్‌పను రూపొందించారు.

‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ (ప్రజలను కాపాడుదాం-రాష్ట్రాన్ని రక్షిద్దాం)అనే పేరిట తన ఎన్నికల ప్రచారాన్ని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలో సోమవారం శ్రీకారం చుట్టిన ఆయన మంగళవారం వరకు పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈపీఎస్‌ పాల్గొన్న సభలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తుండటంపై అన్నాడీఎంకే శ్రేణుల్లో హర్షం నెలకొంది. బుధవారం ఉదయం నిర్వహించిన రోడ్‌షోలో ఈపీఎస్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

భక్తులు ఆలయాలకు సమర్పించే కానుకలు, నిధులను ఆలయాల అభివృద్ధికి ఉపయోగించకుండా హిందూ దేవాదాయశాఖ కళాశాలలకు మళ్లిస్తోందని, విద్యాశాఖ కోసం కేటాయించే నిధులు ఏమయ్యాయని ఈపీఎస్‌ ప్రశ్నించారు. అన్నాడీఎంకేకు రాష్ట్రంలో ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందని, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈపీఎస్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 11:07 AM