PMK: మా పార్టీలో సంక్షోభానికి డీఎంకే కారణం కాదు..
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:11 PM
పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి డీఎంకే కారణం కాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ స్పష్టం చేశారు. నగరంలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్‌ను పరామర్శించేందుకు గురువారం రాందా స్ దిండివనం నుం డి నగరానికి చేరుకున్నారు.
- పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్
చెన్నై: పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి డీఎంకే కారణం కాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr Ramdas) స్పష్టం చేశారు. నగరంలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్‌ను పరామర్శించేందుకు గురువారం రాందా స్ దిండివనం నుం డి నగరానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కార్యాచరణ అధ్యక్షుడు అన్బుమణి(Anbumani) ఆరోపించినట్లు పార్టీలోని సంక్షోభ పరిస్థితులకు డీఎంకే(DMK)కు సంబంధం లేదని,
ఈ విషయంలో అసత్య ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. ఏవైనా తప్పిదాలు చేసి ఉంటే క్షమించాలంటూ అన్బుమణి వేడుకోవడంపై తానెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని రాందాస్ అన్నారు. అన్బుమణి మీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని భావిస్తున్నారా? అని విలేఖరుల ప్రశ్నించగా.. రాందాస్ ‘పోగ పోగ తెరియమ్’ (రాబోవు రోజుల్లో తెలుస్తుంది) అంటూ ఓ పాత తమిళ సినిమా పాట పల్లవి అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 20 , 2025 | 12:11 PM