జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:24 PM
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసి న పోరాటంలో జైలుకెళ్లిన పెద్దధన్వాడ రైతులు 11 మంది, చిన్నధన్వాడ రైతు ఒకరు బుధవా రం జైలు నుంచి విడుదలయ్యారు.
అలంపూరుచౌరస్తా, జూన్18 (ఆంధ్రజ్యోతి): ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసి న పోరాటంలో జైలుకెళ్లిన పెద్దధన్వాడ రైతులు 11 మంది, చిన్నధన్వాడ రైతు ఒకరు బుధవా రం జైలు నుంచి విడుదలయ్యారు. అలంపూరు జూనియర్ సివిల్ కోర్టు వారికి కండీషన్ బెయి ల్ మంజూరు చేసింది. దీంతో వారు మహబూ బ్‌నగర్ జైలు నుంచి సాయంత్రం విడుదలయ్యారు. నేరుగా కర్నూలులోని చల్లా బంగ్లాకు వెళ్లి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కలిశారు. ఎమ్మెల్యే వారి యోగక్షేమాలు, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేసి అవమానించిందని ఈ సందర్బంగా ఎమ్మెల్యే విమర్శించారు.