ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య

ABN, First Publish Date - 2025-05-08T16:11:54+05:30

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్.. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి దిగింది. ఈ దాడిలో 100 మందికిపైగా మరణించారు. ఈ చర్యకు ఆపరేషన్‌ సిందూర్ అనే పేరును కేంద్రం పెట్టింది. ఈ ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భార్య స్పందించింది.

Madhusudan Rao Wife Kamakshi Prasanna

న్యూఢిల్లీ, మే 08: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత్ సైన్యం చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై పహల్గాం దాడిలో మరణించిన కేరళకు చెందిన మధుసూదన్ రావు భార్య కామాక్షి ప్రసన్న తాజాగా స్పందించారు. దాయాది దేశం పాకిస్థాన్‌పై కేంద్రం ఈ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టడాన్ని ఆమె స్వాగతించారు. ఈ చర్య బాధిత కుటుంబాలకు కొంత సాంత్వన కలిగిస్తుందన్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడిలో తాము భర్తలను కోల్పోయామని ప్రజలంతా భావిస్తున్నారని.. కానీ తాము జీవితాలనే కోల్పోయామని ఈ సందర్భంగా కామాక్షి కన్నీటి పర్యంతమయ్యారు. పహల్గాం దాడిలో 26 మంది మరణించడంతో.. దేశంలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని ఆమె పేర్కొన్నారు.


ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకాశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా బాధిత కుటుంబాలను కలిసి.. పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగింది, ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు ఏం చేశారు.. ఎలా వ్యవహరించారు.. ఏమని ప్రశ్నించారంటూ ఎన్ఐఏ బృందాలు వారికి ప్రశ్నలు సంధించారు. అలా దాదాపు అన్ని బాధిత కుటుంబాలను ఈ బృందాలు ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నాయి.


మరోవైపు ఈ దాడితో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కి సంబంధాలున్నాయనే సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులను భారత సైన్యం చేపట్టింది. ఈ చర్యకు ఆపరేషన్ సిందూర్ అనే పేరును కేంద్రం పెట్టింది. ఈ ఆపరేషన్ సిందూర్‌పై కామాక్షి ప్రసన్నపై విధంగా స్పందించారు.


ఇంకోవైపు ఈ ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతోన్నాయి. ఆమె కుటుంబ సభ్యులు సైతం సోఫియా పాత్రను అభినందిస్తున్నారు.

Operation Sindoor: ఈ పాపకు ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..

Updated Date - 2025-05-08T16:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising