Operation Sindoor: పాక్ న్యూక్లిరియర్ ఫెసిలిటీపై భారత్ దాడి చేసిందా?.. ఆర్మీ ఏం చెప్పిందంటే
ABN, Publish Date - May 12 , 2025 | 07:03 PM
సర్గోధాలోని ముషాప్ ఎయిర్‌బేస్‌ను టార్గెట్ చేసినట్టు సైన్యం ప్రకటించడంతో అక్కడికి సమీపంలోని కిరానా హిల్స్‌పైనా సైన్యం దాడి చేసి ఉండొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కిరానా హిల్స్ వద్ద అణునిల్వలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరిట చేపట్టిన సైనిక చర్యలో భాగంగా పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ వద్దనున్న అణుస్థాపరాన్ని భారత బలగాలు టార్గెట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి (AK Bharti) తోసిపుచ్చారు. ఇందులో ఎంతమాత్ర నిజం లేదన్నారు. కిరానా హిల్స్‌ను భారత సైన్యం లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు సోమవారంనాడు నిర్వహించిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కిరానా హిల్స్ హౌసెస్‌లో కొన్ని అణ్యాయుధాలు ఉన్నట్టు సమాచారం ఇచ్చినందుకు మీడియాకు థాంక్స్ చెప్పారు. అయితే ఆ విషయం తమకు తెలియదని, కిరానా హిల్స్‌లో ఏమున్నప్పటికీ తాము టార్గెట్ చేసిన జాబితాలో మాత్రం అది లేదని వివరించారు.
India Pakistan DGMO talks: ముగిసిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారు
సర్గోధాలోని ముషాఫ్ ఎయిర్‌బేస్‌ను టార్గెట్ చేసినట్టు సైన్యం ప్రకటించడంతో అక్కడికి సమీపంలోని కిరానా హిల్స్‌పైనా సైన్యం దాడి చేసి ఉండొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కిరానా హిల్స్ వద్ద అణునిల్వలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో చోటుచేసుకుంది. పాక్‌లో తరచు భూకంపకాలకు కూడా దాడుల ప్రభావం ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. విశాలమైన పర్యతప్రాంతమైన రాకీ హిల్స్ పాకిస్థాన్ రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. స్థానికులు దీనిని 'బ్లాక్ మౌంటైన్స్' అని కూడా పిలుపుస్తారు. రబ్వాహ్ టౌన్‌షిప్, సర్గోధా సిటీ మధ్యలో ఇది ఉంది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..
Updated Date - May 12 , 2025 | 07:04 PM