ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: 48 విమాన సర్వీసులు రద్దు.. ఎందుకంటే..

ABN, Publish Date - Jun 24 , 2025 | 10:53 AM

దేశంలో 48 విమాన సర్వీసులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఆ జాబితాలో కొన్ని న్యూఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా.. మరికొన్ని న్యూఢిల్లీ నుంచి బయలుదేరాల్సినవి ఉన్నాయి.

న్యూఢిల్లీ, జూన్ 24: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకున్న నేపథ్యంలో మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆకాశ మార్గాన్ని మూసి వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ జాబితాలో 28 విమాన సర్వీసులు న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉందని.. అలాగే మరో 20 విమాన సర్వీసులు న్యూఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉందని వివరించింది. వాటిలో ఎయిర్ ఇండియా విమానాలు 17, ఇండిగో సంస్థకు చెందినవి 8, ఇతర విమాన సర్వీసులకు చెందినవి మూడు సర్వీసులు ఉన్నాయని విపులీకరించింది.

మరో వైపు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఈ యుద్ధాన్ని ముగిస్తున్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది. అలాంటి వేళ.. మధ్య ప్రాచ్యంలోని విమానాశ్రయాలు క్రమంగా తెరుచుకోనున్నాయని.. ఈ నేపథ్యంలో క్రమంగా విమాన సర్వీసులు నడుపుతామని ఈ రోజు ఉదయం ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని పేర్కొంది. విమాన ప్రయాణాలు, సర్వీసుల ఆప్ డేట్ కోసం మొబైల్ యాప్ లేదా తమ వెబ్ సైట్‌ను సందర్శించాలని ప్రయాణికులకు సూచించింది.

ఇవి కూడా చదవండి:

దారుణం.. 30 మంది భార్యలు హతం

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడ్డుపడతున్న చైనా

For More National News and Telugu News

Updated Date - Jun 24 , 2025 | 11:56 AM