Husbands kills: దారుణం.. 30 మంది భార్యలు హతం
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:22 AM
భార్యల చేతిలో భర్తలు ఒక పథకం ప్రకారం హత్యకు గురవుతున్నారు. ఈ ఘటనల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే భర్తల చేతిలో భార్యలు సైతం దారుణంగా హత్యకు గురవుతున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 24: భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్నారు. ఒక పథకం ప్రకారం.. ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు. అందుకు ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ముస్కాన్ రస్తోగి.. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ.. ఆంధ్రప్రదేశ్‌లోని లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ సంఘటనలు ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ ఘటనలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే 115 రోజుల్లో 30 మంది భార్యలు.. తమ భర్తల చేతిలో దారుణంగా హతమయ్యారు. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. అంటే ప్రతి నాలుగు రోజులకు ఒక భార్య.. భర్త చేతిలో హతమైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ధాంతరిలో పెళ్లైన మూడు నెలలకే భార్య గొంతును భర్త కోశాడు. అలాగే బలోడ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. భార్య రోడ్డు ప్రమాదంలో మరణించిందని భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమె ప్రమాదంలో చనిపోలేదని.. హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. ఈ తరహా హత్యలు.. రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. అయితే వీటిలో 10 కంటే ఎక్కువ హత్యలు అనుమానం లేదా అసూయ కారణంగానే జరిగాయి.. మద్యం మత్తులో 6.. సెక్స్ నిరాకరించినందుకు రెండు.. గృహహింస, వరకట్న వివాదాల కారణంగా మరికొన్ని జరిగాయని ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారి వివరించారు.
ఈ హత్యలపై సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డిఎన్ శర్మ స్పందించారు. మనం పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్నారు. దీంతో పురుషలు వేలాది హత్యలు చేస్తున్నారు. కానీ వారిపై ఎటువంటి విమర్శలు వెల్లువెత్తడం లేదని చెప్పారు. కానీ ఒక స్త్రీ అలా వ్యవహరిస్తే మాత్రం మొత్తం ఆడజాతిని అవమానిస్తున్నారని గుర్తు చేశారు. ఎవరు చేసినా.. హత్య హత్యేనని స్పష్టం చేశారు.
కొన్ని సంచలనం సృష్టించిన కేసుల ఆధారంగా స్త్రీ జాతిని లక్ష్యంగా చేసుకోవడం పురుషాధిక్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. అందులోభాగంగా భార్యలను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం మాత్రమే కాదు.. ఇది ప్రమాదకరమని డిఎన్ శర్మ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడ్డుపడతున్న చైనా
For More National News and Telugu News