CRPF Constable: పాక్ మహిళతో పెళ్లి.. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌పై వేటు
ABN, Publish Date - May 03 , 2025 | 08:59 PM
CRPF Constable: టూరిస్టు వీసా ద్వారా ఇండియాలోకి వచ్చిన అప్పటినుంచి మునాల్, అహ్మద్ కలిసే ఉంటున్నారు. వీసా తేదీ మార్చి 22తో ముగిసిపోయింది. అయినప్పటికి మునాల్ ఇక్కడే ఉంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకీస్తానీల వీసాలు రద్దు చేయటంతో మునాల్ విషయం వెలుగులోకి వచ్చింది.
హహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థానీల వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం ఊడిపోయింది. ఇందుకు అతడి భార్యే కారణం అయింది. సదరు కానిస్టేబుల్ భార్య పాకిస్తానీ కావటంతో అధికారులు ఆమె భర్తను ఉద్యోగంలోంచి తీసేశారు. అతడు ఆడిన ఆటలే కొంపముంచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. జమ్మూకు చెందిన అహ్మద్ అనే వ్యక్తి 2017లో సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అయ్యాడు. సంవత్సరం క్రితం అతడు ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశాడు.
ఆ లేఖలో తాను పాకిస్తాన్‌కు చెందిన మునాల్ ఖాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అధికారులనుంచి పెళ్లికి ఆమోదం రాకుండానే పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2024 మే నెలలో ఇద్దరూ వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. మునాల్ టూరిస్టు వీసా ద్వారా ఇండియాకు వచ్చింది. అప్పటినుంచి మునాల్, అహ్మద్ కలిసే ఉంటున్నారు. వీసా తేదీ మార్చి 22తో ముగిసిపోయింది. అయినప్పటికి ఆమె ఇక్కడే ఉంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకీస్తానీల వీసాలు రద్దు చేయటంతో మునాల్ విషయం వెలుగులోకి వచ్చింది.
మునాల్ ఇండియానుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలని నోటీసులు వచ్చాయి. ఆమెను అట్టారీ వాఘా బార్డర్‌కు సైతం పంపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి ఆమెకు ఊరట లభించింది. మరో 10 రోజులు ఆమె ఇండియాలో ఉండటానికి అవకాశం ఇచ్చింది. అయితే, అహ్మద్ పెళ్లి విషయం సీఆర్‌పీఎఫ్ అధికారులకు తెలిసింది. అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అతడిపై చర్యలు చేపట్టారు. వాయిలేషన్ ఆఫ్ సర్వీస్ కండెక్టర్, డెట్రిమెంటల్ టు నేషనల్ సెక్యూరిటీ కింద అతడ్ని విధుల్లోంచి తొలగించారు.
ఇవి కూడా చదవండి
APSDMA: ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
Updated Date - May 03 , 2025 | 08:59 PM