CP Radhakrishnan: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ తేదీ ఖరారు
ABN, Publish Date - Aug 19 , 2025 | 04:15 PM
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేయనున్నారు. ఆయనకు మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఉదయం ఎన్డీయే పక్ష నేతలు సమావేశం కాగా, సాయంత్రం 4.30 గంటలకు మరోసారి సమావేశమవుతున్నారు.
ప్రతిపక్షాల మద్దతు కోరిన మోదీ
కాగా, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియం మంగళవారం ఉదయం ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధాని స్వయంగా ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం రాధాకృష్ణన్‌ను సన్మానించారు.
కాగా, 20వ తేదీ ఉదయం 11 గంటలకు సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని కిరణ్ రిజిజు చెప్పారు. ఎన్డీయే ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు సంతకాలు చేస్తారని చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని ఎంపీలతో సహా ఎన్డీయే నేతలంతా నామినేషన్ల దాఖలు ప్రక్రియకు హాజరవుతారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం
ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 19 , 2025 | 04:24 PM