Share News

Tejaswi Yadav: రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:36 PM

నవడా ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్, బీజేపీ చేతులు కలిపాయని, బిహార్ ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఓటు హక్కును చోరీ చేయాలని బీజేపీ అనుకుంటోందని, ఎస్ఐఆర్ అనేది ఓట్ల దోపిడీ అని, ఇదెంతమాత్రం సాగనీయమని అన్నారు.

Tejaswi Yadav: రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం
Tejaswi yadav with Rahul Gandhi

నవడా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సంకేతాలిచ్చారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కృషి చేస్తాయని చెప్పారు. తేజస్వి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు రాహుల్ గాంధీ ఆయన పక్కనే ఉన్నారు. రాహుల్ చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' (Voter Adhikar Yatra) మంగళవారంనాడు బిహార్‌లోని నవడాలో సాగుతోంది. ఈ యాత్రలో తేజస్వి పాల్గొని మాట్లాడారు.


'ఇండియా' కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై అప్పట్లో కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే అయితే మద్దతు ఇవ్వగలమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


బీహార్ ప్రజలను ఫూల్స్ చేసేందుకు..

నవడా ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్, బీజేపీ చేతులు కలిపాయని, బిహార్ ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఓటు హక్కును చోరీ చేయాలని బీజేపీ అనుకుంటోందని, ఎస్ఐఆర్ అనేది ఓట్ల దోపిడీ అని, ఇదెంతమాత్రం సాగనీయమని అన్నారు. బిహార్‌లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా కుట్ర జరుగుతోందని చెప్పారు. నితీష్ కుమార్ సారథ్యంలోని 'పాతబడిన, చిరిగిపోయిన' ప్రభుత్వాన్ని యువత ఇంటికి సాగనంపాలని కోరారు. చినిగిపోయిన వస్తువులను కొత్తవాటితో భర్తీ చేసినట్టే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు యువత పట్టుదలగా ఉందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్

జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 03:39 PM