Share News

Justice B Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:46 PM

జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. దేశంలోని ప్రముఖ, ప్రగతిశీల న్యాయవాదుల్లో సుదర్శన్ రెడ్డి ఒకరని, సుదీర్ఘమైన లీగల్ కెరీర్ కలిగి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడంలో విఖ్యాతి పొందారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

Justice B Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్
B Sudarshan Reddy

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవిని ఏకగ్రీవం చేయాలనే ఎన్డీయే కూటమి ఆశలపై విపక్ష 'ఇండియా' కూటమి నీళ్లు చల్లింది. తమ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి (B Sudarshan Reddy) పేరును మంగళవారంనాడు ప్రకటించింది. దీంతో ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, 'ఇండియా' కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది.


జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. దేశంలోని ప్రముఖ, ప్రగతిశీల న్యాయవాదుల్లో సుదర్శన్ రెడ్డి ఒకరని, సుదీర్ఘమైన లీగల్ కెరీర్ కలిగి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడంలో విఖ్యాతి పొందారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆయన పేదల పక్షపాతి అని, రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఎంతో పాటుపడ్డారని వివరించారు.


జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గురించి...

1. 78 ఏళ్ల జస్టిస్ (రిటైర్డ్) రెడ్డి నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్ సాగించారు. 1946 జూలై 8న జన్మించిన ఆయన 1971 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్, సివిల్ మేటర్స్‌లో ప్రాక్టీసు చేశారు.

2. 1988-1990 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో కొద్ది కాలం కేంద్రానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.

3. ఉస్మానియా యూనివర్శిటీ లీగల్ అడ్వైజర్‌గా, స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు.

4.1995 మేలో ఆంధ్రప్రదేశ్ హైకర్టు శాశ్వాత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2005 డిసెంబర్‌లో గువాహటి చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు.

5.2007 జనవరి 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2011 జూలై 8న పదవీ విరమణ చేసేంత వరకూ తమ సేవలు అందించారు.


మరిన్ని వివరాలు..

జస్టిస్ రెడ్డి 2013 మార్చిలో గోవా మొదటి లోకాయుక్తగా పనిచేశారు. అయితే ఏడు నెలల్లోనే వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. హైద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ బోర్టర్ ఆప్ ట్రస్ట్రీగా కూడా ఆయన సేవలందించారు. తాజాగా ఆయనను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా 'ఇండియా' కూటమి ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 02:49 PM