ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర కౌంట్ డౌన్ స్టార్ట్

ABN, Publish Date - May 12 , 2025 | 06:06 PM

అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగతో ముగుస్తుంది. దేశం నలుమూలల నుండి భక్తులు అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించే డివోషనల్ జర్నీకి సిద్ధమవుతున్నవారు. బాబా బర్ఫానీ, శివుడి..

Amarnath Yatra 2025

Amarnath Yatra: 2025 అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగతో ముగుస్తుంది. ఎప్పటిలాగే దేశం నలుమూలల నుండి భక్తులు అమర్‌నాథ్ గుహని దర్శించే ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నవారు. బాబా బర్ఫానీ, శివుడి ఆశీస్సులకోసం ఎప్పుడెప్పుడాని పరితపిస్తున్నారు. మరోవైపు, అమర్‌నాథ్ యాత్రకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్న తరుణంలో, భక్తులు మంచుతో సహజ సిద్ధంగా ఏర్పడే పురాణ శివలింగాన్ని వీక్షించడానికి పవిత్ర ప్రయాణం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది యాత్ర అధికారికంగా ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే భక్తుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. భారీగా హిమపాతం ఉన్నప్పటికీ యాత్రికుల రిజిస్ట్రేషన్లు ఇంకా ఇంకా పెరుగుతుండటంతో అధికారులు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు.

దురదృష్టకర పహల్గాం దాడి ఉన్నప్పటికీ, భక్తులలో ఉత్సాహం మాత్రం సడలలేదు. లక్షలాది మంది భక్తులు అమర్ నాథ్ యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, యాత్ర కోసం ఇప్పటికే 3,60,000 మందికి పైగా యాత్రికులు నమోదు చేసుకున్నారు. అధికారికంగా అమర్ నాథ్ యాత్ర మొదలయ్యే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు, యాత్రా మార్గాల్లో రికార్డు స్థాయిలో హిమపాతం కురుస్తోంది. అయినప్పటికీ ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మంచుతో కప్పబడిన మార్గాలను యాత్రికుల కోసం క్లియర్ చేయడానికి అధికారులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. రెండు ప్రధాన మార్గాలైన బాల్తాల్, చందన్‌వారీలలో మంచు తొలగింపు పనులు ఇప్పటికే ప్రారంభించారు. తద్వారా యాత్రికులు నడవడానికి ట్రాక్‌లు వీలుగా మారే అవకాశం ఉంది. అయితే, ఈ ఏడాది ఆయా మార్గాల్లో మంచు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీంతో పనులు చేయడం సవాలుగా మారింది. కొన్ని ప్రాంతాలలో అయితే, మంచు 10 నుండి 20 అడుగుల వరకు ఉందని, ఇది మార్గాన్ని క్లియర్ చేయడంలో పాల్గొన్న వారికి చాలా అడ్డంకిగా ఉందని అధికారులు చెబుతున్నారు.పంజ్తరణి, శేషనాగ్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మంచు భారీగా ఉంది.

అటు, తీర్థయాత్రకు జరుగుతున్న సన్నాహాలను సమీక్షించడానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం శ్రీనగర్‌లోని పంథా చౌక్‌లోని అమర్‌నాథ్ యాత్ర ట్రాన్స్‌పోర్ట్ శిబిరాన్ని సందర్శించారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకుని తగు సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News


ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్న మొక్కలు

Updated Date - May 12 , 2025 | 06:55 PM