Twins Born One Heart One Liver: ఒకే గుండె, ఒకే కాలేయంతో జన్మించిన కవలలు..24 గంటల్లోనే మృతి, ఎందుకిలా..
ABN, Publish Date - Aug 07 , 2025 | 05:49 PM
మనం కొన్ని సందర్భాల్లో శరీరం ఒక్కటిగా ఉండి జన్మించిన అరుదైన పిల్లల దృశ్యాలను చూస్తుంటాం. ఇటీవల కూడా అలా ఇద్దరు చిన్నారులు గుండె, కాలేయం వంటి భాగాలతో ఒక్కటై పుట్టారు. కానీ ఈ కవలలు జన్మించిన 24 గంటల్లోనే దురదృష్టవశాత్తూ మరణించారు.
అప్పుడప్పుడు మనం పలు రకాల ఆశ్చర్యకర దృశ్యాలను చూస్తుంటాం. శరీరం ఒక్కటైపోయి కవలలు (Twins Born One Heart One Liver) పుడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల కూడా అరుదైన కవలలు జన్మించారు. కానీ వీరు కేవలం ఛాతీ, కడుపు భాగాలే కాకుండా, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు కూడా పంచుకుని ఒక్కటిగా పుట్టారు.
ఈ మాదిరిగా గతంలో జన్మించిన అనేక మంది కూడా జీవించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల పుట్టిన కవలలు మాత్రం 24 గంటల్లోనే మరణించారు. ఈ విషాదకర ఘటన మీరట్‌లోని లాలా లజపతి రాయ్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది.
ఒకటిగా అతుక్కుని
బాగ్‌పట్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఇటీవల ప్రసవ వేదనతో మెడికల్ కాలేజీలో చేరింది. డాక్టర్ రచనా చౌదరి ఆమె చికిత్సను పర్యవేక్షించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష సమయంలో రేడియాలజిస్ట్ డాక్టర్ యాస్మిన్ ఉస్మానీ, ఆమె గర్భంలో కవలలు ఒకటిగా అతుక్కుని ఉన్నారని గుర్తించారు. దీంతో, అత్యవసర సిజేరియన్ ద్వారా ఈ కవలలను బయటకు తీశారు.
అరుదైన కవలల మరణం..
ఇలాంటి కేసులు చాలా అరుదని డాక్టర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50,000 నుంచి 1,00,000 జననాలలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి కవలలు జన్మిస్తారని వెల్లడించారు. సాధారణంగా గర్భం మొదటి దశల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఆమె వివరించారు. కానీ చివరకు ఈ కవలలు పుట్టిన తర్వాత కొన్ని గంటలు మాత్రమే బతికారు. అయితే, తల్లి ఆరోగ్యం మాత్రం స్థిరంగా ఉందని, కోలుకుంటోందన్నారు.
ఏ భాగాల వద్ద
కొన్ని సందర్భాల్లో కవలలు ఛాతీ, కడుపు లేదా పొత్తికడుపు భాగాల వద్ద ఒకటిగా అతుక్కుని పుడతారు. పలుమార్లు వారి అవయవాలు ఒకటిగా ఉంటాయి. అలాంటి కవలలను విడదీసే శస్త్రచికిత్స సాధ్యమే. కానీ అది ఎంత సక్సెస్ అవుతుందనేది వారు ఏ భాగాల వద్ద అతుక్కుని ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో, ఇలాంటి కవలలు పుట్టిన తర్వాత ఎక్కువ కాలం జీవించలేరని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 07 , 2025 | 06:24 PM