PM Modi Roadshow: మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
ABN, Publish Date - May 26 , 2025 | 03:36 PM
సోఫియా ఖురేషి సాధించిన విజయాలు, మహిళా సాధికారతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆమె ట్విన్ సిస్టర్ షైనా సున్‌సార ప్రశంసించారు. మహిళా సాధికారతకు మోదీ ఎంతో చేస్తున్నారని అన్నారు.
వడోదర: ఆపరేషన్ సిందూర్ (Operaiton Sindoor) గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించిన ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి (Sofiya Qureshi) ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరాలో సోమవారంనాడు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోఫియా కుటుంబ సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు. సోఫియా తల్లిదండ్రులు, సోదరుడు మహమ్మద్ సంజయ్ ఖురేషి, సోదరి షైన సున్‌సారలు మోదీకి సాదర స్వాగతం పలికారు. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన ప్రధానికి అభినందించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్‌షోలో పాల్గొన్నారు.
NIA: పాక్‌తో గూఢచర్యం.. సీఆర్‌పీఎఫ్ జవానును అరెస్టు చేసిన ఎన్ఐఏ
పీఎం మహిళా సాధికారతపై ప్రశంసలు
సోఫియా ఖురేషి సాధించిన విజయాలు, మహిళా సాధికారతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆమె ట్విన్ సిస్టర్ షైనా సున్‌సార ప్రశంసించారు. మహిళా సాధికారతకు మోదీ ఎంతో చేస్తున్నారని అన్నారు. సోఫియా తన ట్విన్ సిస్టర్ అని, దేశానికి తన సోదరి సేవ చేస్తుండటం తనకే కాకుండా, అందరికీ గర్వకారణమవుతుందన్నారు. సోఫియా అందరికీ సోదరేనని అన్నారు. ప్రధాని రోడ్‌షోలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారని, మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సిందూర్ వంటి అతిపెద్ద సైనిక చర్య నిర్వహించారని అన్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్‌లో తన సోదరి సోఫియా ఖురేషి, మరో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నట్టు చెప్పారు. తద్వారా మహిళలు ఎవరికీ తక్కువ కాదనే సందేశాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు.
సోఫియా సోదరుడు సంజయ్ ఖురేషి సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధానమంత్రి ఇక్కడకు రావడం మరిచిపోలేమన్నారు. తన సోదరికి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి, రక్షణ బలగాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సోఫియా తనకు మాత్రమే కూతురు కాదని, దేశ ప్రజలందరి బిడ్డ అని ఆమె తల్లి హలిమా ఖురేషి అన్నారు. మోదీ ఈ దేశ ప్రధాని అని, అందరితో పాటు తాము కూడా ఆయనకు సాదర స్వాగతం పలికామని చెప్పారు.
వడోదరకు చెందిన సోఫియా ఖురేషి 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా ఇండియన్ ఆర్మీలోకి అడుగుపెట్టారు. కౌంటర్ ఇన్‌సర్జెన్సీ జోన్లలో పనిచేశారు. 2016లో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కంటింజెంట్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Narendra Modi: మేడిన్ ఇండియా వస్తువులు ఉపయోగించాలి..వారి అభివృద్ధికి పాటు పడాలి
Rains: నైరుతీ రుతుపవనాల ప్రభావం.. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు
For National News And Telugu News
Updated Date - May 26 , 2025 | 04:21 PM