CM Stalin: సీఎం స్టాలిన్ ధీమా.. ఆ కూటమితో మాకేం నష్టం లేదు..
ABN, Publish Date - May 14 , 2025 | 11:24 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ కూటమితో మాకేం నష్టం లేదు.. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చానీయాంశమైంది. అన్నాడీఎంకే, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు జట్టుకట్టి మరో ఏడాదాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: అసెంబీ ఎన్నికలకు యేడాది ముందే అవినీతి, అక్రమార్జన కేసులలో ఈడీ, ఐటీ దాడులనుంచి తప్పుకునేందుకు, ఆదరాబాదరగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే కూటమి వల్ల డీఎంకే కూటమికి లేశమాత్రం నష్టం వాటిల్లదని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) అన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ తొమ్మిది నెలల పాటు పాల్గొనే ప్రతిసభలోనూ ప్రకటించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఉన్నట్టుండి అప్పటివరకు తిట్ల వర్షం కురిపించిన బీజేపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకు తిరగటాన్ని రాష్ట్ర ప్రజలంతా ఏవగించుకుంటున్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లకు పైగా గెలుచుకుంటుందని చెప్పటానికి ప్రజలంతా ద్రావిడ తరహా పాలనకు గట్టి మద్దతు ఇస్తుండటమే కారణమన్నారు. మహిళాభ్యుదయానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శవంతంగాఉంటున్నాయని, ‘అందరికీ అన్ని సదుపాయాలు’ అనే ఏకైక లక్ష్యంతోనే నాలుగేళ్లుగా తమ పాలన సమర్థవంతంగా కొనసాగిందని చెప్పారు. డీఎంకే కూటమి ప్రస్తుతం పటిష్టంగానే ఉందని, మరిన్ని పార్టీలు కూటమిలో చేరుతాయో లేదో వేచి చూడాలని అన్నారు.
ఓర్వలేకే ఈడీ దాడులు...
రాష్ట్రంలో నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలేకనే తమ మంత్రులపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ వంటి సంస్థల ద్వారా అదే పనిగా దాడులు చేయిస్తోందని స్టాలిన్ విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలలో రోజురోజుకూ తమపై పెరుగుతున్న ఆదరాభిమానాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామనే నమ్మకం తనకు ఉందన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నాడీఎంకేతో పొత్తును ఖరారు చేసుకున్న సమయంలో ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2016 ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షా భారతదేశంలోనే అత్యధికంగా అవినీతి అక్రమాలకు పాల్పడింది అన్నాడీఎంకే ప్రభుత్వమేనని ఆరోపించారని, ప్రస్తుతం ఆ పార్టీతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించలేకపోతున్నారని చెప్పారు.
గవర్నర్ పదవి అనవసరం...
శాసనసభలో ఆమోదించిన పది బిల్లులకు ఆమోదం తెలుపకుండా మొండి వైఖరి అనుసరించడం వల్లే గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుదాకా వెళ్ళి ఆ బిల్లులకు ఆమోదం లభించేలా అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించేలా చక్కటి తీర్పును సంపాదించుకోగలిగినట్లు స్టాలిన్ చెప్పారు. గవర్నర్ పదవి ఉండకూడదనే దశాబ్దాల తరబడి తమ పార్టీ చెబుతోందని, అదే సమయంలో గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను ఇస్తూనే ఉంటామని చెప్పారు. గవర్నర్‌కు, తనకు వ్యక్తిగతమైన విరోధాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!
దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!
Read Latest Telangana News and National News
Updated Date - May 14 , 2025 | 11:24 AM