CM Siddaramaiah: నావి అబద్ధాలైతే.. వేదికలపై మాట్లాడను..
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:27 PM
అభివృద్ధి విషయంలో కేంద్రం మాకు ద్రోహం చేసిందనే విషయంలో నేను అబద్ధాలు చెప్పినట్టు నిరూపిస్తే ఇకపై వేదికలపై ప్రసంగాలు చేసేది లేదని సీఎం సిద్దరామయ్య సవాల్ విసిరారు. దావణగెరె జిల్లాలో సోమవారం రూ.1350 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
- దావణగెరెలో సీఎం సిద్దరామయ్య సవాల్
బెంగళూరు: అభివృద్ధి విషయంలో కేంద్రం మాకు ద్రోహం చేసిందనే విషయంలో నేను అబద్ధాలు చెప్పినట్టు నిరూపిస్తే ఇకపై వేదికలపై ప్రసంగాలు చేసేది లేదని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) సవాల్ విసిరారు. దావణగెరె జిల్లాలో సోమవారం రూ.1350 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో కులమతాలు, పార్టీలు చూడమన్నారు. అన్ని పార్టీలవారు మా గ్యారెంటీల లబ్ధిదారులన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.11,500 కోట్లు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, భద్ర ఎగువ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన 5వేల కోట్లు ఇవ్వలేదని, ఇదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహమన్నారు.
ప్రతిపక్షనేత అశోక్, బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర బహిరంగచర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 56 అంగుళాల ఛాతీ కల్గిన ప్రధాని మోదీ విఫలమయ్యారన్నారు. ఛాతీ ఎన్ని అంగుళాలు ఉంటే మాత్రం పేదలు, మధ్య తరగతి ప్రజలపట్ల అభిమానం, మానవత్వం ఉండాలన్నారు. రాష్ట్రఖజానాలో నిధులు లేవనే బీజేపీకి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామన్నారు. గ్యారెంటీలు అమలు కావని ఎన్నోసార్లు చెప్పారన్నారు. దేశంలో ఎవరికంటికైనా మంచి రోజులు కనిపించాయా..? అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అబద్ధాలకు రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఉప ఎన్నికల్లో శిగ్గావి, చన్నపట్టణలో మాజీ సీఎంల కుమారులే ఓడారని, సండూరులో మేమే గెలిచామన్నారు.
శ్యామనూరు కోరితే వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్
శ్యామనూరు శివశంకరప్ప 95వ జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఆయన కోరితే వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇస్తామని సీఎం ప్రకటించారు. శ్యామనూరు శివశంకరప్ప బర్త్‌డే కేక్ కట్ చేశారు. ఇదే సందర్భంగా కులాంతర వివాహాలను జరిపించారు. డీసీఎం డీకే శివశకుమార్, హోం మంత్రి పరమేశ్వర్, శ్యామనూరు కుమారుడు, ఉద్యానవన శాఖ మంత్రి మల్లికార్జున, కోడలు ప్రభా మల్లికార్జునతోపాటు పలువురు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News and National News
Updated Date - Jun 17 , 2025 | 01:27 PM