Alimony Dispute: మీరు చదువుకున్నవారు..ఇలా అడుక్కోవొద్దు
ABN, Publish Date - Aug 07 , 2025 | 04:00 AM
విడాకులు కోరుతూ భర్త నుంచి భరణం కింద ఆ భార్య ముంబైలోని ఖరీదైన ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు..
భరణంగా బీఎండబ్ల్యూ కారు కోరినమహిళను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 6: విడాకులు కోరుతూ భర్త నుంచి భరణం కింద ఆ భార్య ముంబైలోని ఖరీదైన ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు, రూ.12 కోట్ల నగదు కోరిన కేసు గుర్తుందా? ఈ వ్యవహారంలో సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఆర్టికల్ 142కింద అధికారాలను ఉపయోగిస్తూ ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. అయితే.. భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు, బీఎండబ్ల్యూ కారును ఆ మహిళ కోరడాన్ని న్యాయబద్ధం కాని డిమాండ్లుగా కొట్టిపారేసింది. గతంలో..ఆమె ముంబై లో ఇంటిని తీసుకునేందుకు ఓ ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. ఆ ఇంటినే విడాకుల సెటిల్‌మెంట్ కింద తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘మీరు చదువుకున్నవారైతే గనక.. మీకోసం మీరు ఇలా అడుక్కోవొద్దు’ అని జస్టిస్ గవాయ్ ఆ మహిళను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
Read Latest Telangana News and National News
Updated Date - Aug 07 , 2025 | 04:00 AM