ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Kagar: ఆపరేషన్ కగార్‌లో పోలీసుల ప్రతిభ.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు..

ABN, Publish Date - May 30 , 2025 | 12:19 PM

వచ్చే ఏడాది మార్చి మాసం చివరి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది.

రాయ్‌పూర్, మే 30: పోలీస్ సిబ్బందికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టుల అణచివేతలో సమర్థవంతంగా పని చేసిన పోలీసులకు పదోన్నతలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 295 మందికి ఆ రాష్ట్ర పోలీస్ శాఖ పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన పదోన్నతులు జాబితాను ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ గౌతమ్ శుక్రవారం రాయ్‌పూర్‌లో విడుదల చేశారు. రిజర్వ్ ఫోర్స్ నుంచి డీఎస్పీ వరకు అన్ని విభాగాల అధికారులకూ ఈ పదోన్నతలు కల్పించినట్లు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. మావోయిస్టులకు కేరాఫ్ ఆడ్రస్‌గా ఉన్నా.. బస్తర్‌లో విధులు నిర్వహించిన వారికి ఈ పదోన్నతులు కల్పించారు.


2026, మార్చి మాసం చివరి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా మావోయిస్టులు తుడుచుపెట్టుకుపోయారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో పోలీసులతోపాటు భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో పలుమార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు.


మరికొంతమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంకొంత మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యాన్ని పోలీసులు దాదాపుగా జల్లెడ పట్టేశారు. అనంతరం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి

2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు ఇవే ..

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 01:58 PM