Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు 31 శాతం తగ్గిన భక్తులు
ABN, Publish Date - May 16 , 2025 | 10:53 AM
Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు భక్తుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చి చేస్తే ఈ ఏడాది 31 శాతం తగ్గినట్లు డేహ్రాదూన్‌కు చెందిన ఎస్‌డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ వెల్లడించింది.
Char Dham Yatra: ఛార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగమైన గంగోత్రి (Gangotri), యమునోత్రి (Yamunotri), కేదార్‌నాథ్ (Kedarnath), బద్రీనాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో, పూర్తిస్థాయిలో చార్‌ధామ్ యాత్ర మొదలైంది. ఈ యాత్రలో భక్తుల (Devotees) కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Government) అన్ని రకాల ఏర్పాట్లు (Arrangements) చేసింది. చార్‌ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తులు 6,62,446 మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
31 శాతం తగ్గిన భక్తుల సంఖ్య..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 31 శాతం భక్తుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. అదే గత ఏడాది యాత్ర ప్రారంభమైన మే 10 నుంచి మే 23 వరకు 9,61,302 మంది భక్తులు సందర్శించినట్లు ఎస్‌డీసీ ఫౌండేషన్ అనే సంస్థ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడి, భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల ప్రభావం భక్తులపై పడిందని ఆ సంస్థ పేర్కొంది. కాగా భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో రానున్న రోజుల్లో యాత్రకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాన్ని ఆ సంస్థ వెల్లడించింది.
Also Read: మహబూబ్ నగర్: పిల్లలమర్రికి అందాల భామలు..
ప్రారంభ కార్యక్రమాల్లో ఉత్తరాఖండ్ సీఎం..
కాగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమన తొలి రోజు కార్యక్రమాల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. ఆలయ ద్వారాలు తెరుచుకునే సమయంలో భారత ఆర్మీకి చెందిన ఘర్వాల్ రైఫిల్స్ సైనికులు సంప్రదాయ బద్ధ భక్తిగీతాలను ప్లే చేశారు. ఆలయం పరిసరాల్లో ముఖ్య సేవక్ భండారా వద్ద భక్తులకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
యాత్రా మార్గాల్లో భక్తులకు ఏర్పాట్లు..
యాత్రా మార్గాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, యాత్రికుల రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. స్థానికులు ఎంతో మందికి ఉపాధి కల్పించే ఛార్‌ధామ్ యాత్ర రాష్ట్రానికి జీవనాడి అని, ఏడాదంతా ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో శీతాకాల తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామని, భక్తుల సౌకర్యార్థం గౌరీ కుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకూ రోప్‌వే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుస్ మన్న తుర్కియా డ్రోన్లు, చైనా ఆయుధాలు
For More AP News and Telugu News
Updated Date - May 16 , 2025 | 10:53 AM