వంశీని వెంటాడుతున్న కేసులు..
ABN, Publish Date - May 16 , 2025 | 07:56 AM
Vallabhaneni Vamshi: 2019 ఎన్నికల సమయంలో వంశీ ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎమ్మార్వో ఇతర రెవెన్యూ అధికారులకు కూడా తెలియకుండా నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి.. ఓటర్లను ప్రభావితం చేశారనే కేసు నమోదైంది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. కానీ కేసు మాత్రం క్లోజ్ చేయలేదు.
Vallabhaneni Vamshi: వైసీపీ నేత (YCP Leader), మాజీ ఎమ్మెల్యే (Former MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)ని కేసులు వెంటాడుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో పీటీ వారెంట్ (PT Warrant) దాఖలవుతోంది. దీంతో వంశీ 95 రోజులుగా జైల్లోనే ఉండిపోయారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో శుక్ర , శనివారం భారీ వర్షాలు
గన్నవరంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన వంశీ.. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీలో చేరారు. ఆయన సన్నిహితుడు అయిన కొడాలి నాని ప్రమేయంతో వైసీపీలోకి వెళ్లారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వంశీ ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎమ్మార్వో ఇతర రెవెన్యూ అధికారులకు కూడా తెలియకుండా నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి.. ఓటర్లను ప్రభావితం చేశారనే కేసు నమోదైంది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. కానీ కేసు మాత్రం క్లోజ్ చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.8,500 కోట్లతో ఇంటింటికీ కుళాయి
For More AP News and Telugu News
Updated at - May 16 , 2025 | 07:56 AM